అక్షరటుడే,నిజామాబాద్ క్రైం: Community Safety Awareness | మన ఊరు.. మన కాలనీల భద్రతను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. నగరంలోని శ్రీరామ గార్డెన్స్‌లో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(nizamabad police) పరిధిలోని సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు అరైవ్ అలైవ్‌లో భాగంగా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Community Safety Awareness | ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే..
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వ్యవసాయదారులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకూడదన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలు ( traffic rules) పాటించాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని, యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా ప్రతి ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలన్నారు. ఆన్లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు.
Community Safety Awareness | హెల్మెట్ లేకుండా బైక్ నడపవద్దు..
బైక్ నడిపేవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా బయటకు వెళ్లవద్దని సీపీ సూచించారు. అతివేగం కారణంగా తమతో పాటు ఇతరుల ప్రాణాలకు సైతం ముప్పు వాటిళ్లుతుందన్నారు. జిల్లాలో బైక్‌పై హెల్మెట్ ధరించి వెళ్తే వారికి ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ చూపిస్తామని సీపీ తెలిపారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల సభ్యులు వచ్చి తమ ఇంటిపెద్ద లేకపోతే పడుతున్న కష్టాలను వివరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి, మేయర్ ఉమారాణి, ఇన్‌ఛార్జి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సర్పంచ్ ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు చిన్న సాయిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు, యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ పూర్ణేశ్వర్, సైబర్ క్రైం ఆర్ఎస్సై రవి తదితరులు పాల్గొన్నారు.


