అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police | ఇంట్లో సమస్యల కారణంగా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుస్తున్నారు.
కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతూ అభం శుభం తెలియని చిన్నారులకు తల్లిదండ్రులు లేకుండా చేస్తున్నారు. ఇటీవల కుటుంబ సమస్యలతో పిల్లలతో కలిసి తల్లులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
Kamareddy Police | కామారెడ్డి పట్టణంలో..
తాజాగా కామారెడ్డి (Kamareddy) పట్టణంలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. పోలీసులు సకాలంలో చేరుకుని తల్లి, ఇద్దరు పిల్లలను రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మహిళ.. పదేళ్లలోపు తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చింది.
కామారెడ్డి పట్టణానికి వచ్చిన ఆమె రైల్వే ట్రాక్‌పై(Kamareddy Railway Station) ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లింది. దీనిని గమనించిన కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ రామకృష్ణ, నర్సింలు వెంటనే వారిని అడ్డుకున్నారు. ట్రాక్ నుంచి పక్కకు తీసుకొచ్చి ఆ ముగ్గురిని కాపాడారు. వారి వివరాలు అడిగి తెలుసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇది కూడా చదవండి : Women Reservation Bill | వాళ్లు ‘మహిళా బిల్లు’కు వ్యతిరేకం.. విపక్షాలపై అమిత్ షా ఫైర్
