అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana BJP Protests | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపు భారతీయ జనతా పార్టీ (భాజపా) భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. పార్లమెంట్‌లో కీలక బిల్లులను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ ఈ ఆందోళనలు చేపట్టనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
Telangana BJP Protests | అన్ని జిల్లాల కేంద్రాలు
భాజపా రాష్ట్ర నాయకత్వం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీ లిమిటేషన్, మహిళా బిల్లులను ప్రతిపక్ష congress, other పార్టీలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమానికి దోహదపడే చట్టాలను ఆమోదించకుండా ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి..: Kondapur Drugs Bust | కొండాపూర్లో డ్రగ్స్ కలకలం
