అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kondapur Drugs Bust | హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్ దందా ఆగడం లేదు. డ్రగ్స్, గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈగల్ టీమ్, ఎస్వోటీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేపడుతున్నా.. డ్రగ్స్ దందా సాగుతూనే ఉంది. తాజాగా పోలీసులు కొండాపూర్‌లో డ్రగ్స్ పట్టుకున్నారు.
ఐటీ కారిడార్ ప్రాంతమైన కొండాపూర్ (Kondapur)లో డ్రగ్స్ విక్రయాలు తీవ్ర కలకలం రేపాయి. ఐటీ ఉద్యోగులు, యువత లక్ష్యంగా కొందరు డ్రగ్స్ విక్రయాలు చేపడుతున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా విజయవాడ (Vijayawada) నుంచి డ్రగ్స్‌ను సేకరించి హైదరాబాద్‌కు తీసుకు వస్తుంది. నిందితుల వద్ద నుంచి పోలీసులు 6.09 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు.
Kondapur Drugs Bust | కఠిన చర్యలు
డ్రగ్స్ రవాణాలో పాల్గొన్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశౄరు. ఇందులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నారు. విజయవాడలో వీరికి డ్రగ్స్ ఎవరు అమ్ముతున్నారు.. హైదరాబాద్‌లో ఎవరికి సప్లై చేస్తున్నారనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నగరంలో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు.
Kondapur Drugs Bust | బానిసలు అవుతున్న యువత
నగరంలో డ్రగ్స్, గంజాయి వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీటికి బానిసలుగా మారుతున్నారు. మరోవైపు నగర శివారు ప్రాంతాల్లో గంజాయి దందా ఎక్కువగా సాగుతున్నట్లు సమాచారం. విద్యార్థులు, ఉద్యోగులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి..: Osmania Hospital Suicide | ఉస్మానియా ఆసుపత్రిలో విషాదం.. పీజీ విద్యార్థి ఆత్మహత్య.. వేధింపులే కారణమా?
