Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Meenakshi Seshadri Dance | 62 ఏళ్ల వయసులోనూ అదే గ్రేస్.. ‘అవురా అమ్మక చెల్లా పాట‌’కు మీనాక్షి శేషాద్రి రీ-క్రియేషన్ వైరల్!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Meenakshi Seshadri Dance | 62 ఏళ్ల వయసులోనూ అదే గ్రేస్.. ‘అవురా అమ్మక చెల్లా పాట‌’కు మీనాక్షి శేషాద్రి రీ-క్రియేషన్ వైరల్!

సినిమా

Meenakshi Seshadri Dance | 62 ఏళ్ల వయసులోనూ అదే గ్రేస్.. ‘అవురా అమ్మక చెల్లా పాట‌’కు మీనాక్షి శేషాద్రి రీ-క్రియేషన్ వైరల్!

మూడు దశాబ్దాల క్రితం చేసిన క్లాసికల్ డ్యాన్స్‌ను అదే శైలి, అదే ఎక్స్‌ప్రెషన్స్‌తో మళ్లీ ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచిన మాజీ స్టార్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 18, 2026 9:53 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
21 గంటలు ago
Share
Meenakshi Seshadri Dance

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Meenakshi Seshadri Dance | నేటి టెక్నాలజీ యుగంలో పాత జ్ఞాపకాలను కొత్తగా మలచడం ఒక ట్రెండ్‌గా మారింది. ఈ ట్రెండ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుతూ, 80–90 దశకాల్లో భారతీయ సినీ రంగంలో ‘డ్యాన్సింగ్ క్వీన్’గా పేరు తెచ్చుకున్న మీనాక్షి శేషాద్రి  తాజాగా చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెటిజన్లను మంత్ర ముగ్ధులను చేస్తోంది.

Contents
  • Meenakshi Seshadri Dance | అదే గ్రేస్‌…
    • Meenakshi Seshadri Dance | 17 ఏళ్ల వయసులో మిస్ ఇండియా..

1992లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), దర్శకుడు కె. విశ్వనాథ్ (Director K. Viswanath) కలయికలో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘ఆపద్బాంధవుడు’ (Aapadbandhavudu)లోని “అవురా అమ్మక చెల్లా” పాట అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు-మనాలి మంచు కొండల మధ్య చిత్రీకరించిన ఈ పాటలో మీనాక్షి శేషాద్రి చేసిన శాస్త్రీయ నృత్యం ప్రేక్షకులను అలరించింది.

Meenakshi Seshadri Dance | అదే గ్రేస్‌…

ఇప్పుడు సరిగ్గా 34 ఏళ్ల తర్వాత, అదే పాటను మీనాక్షి మళ్లీ రీ-క్రియేట్ చేయడం విశేషం. ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్‌లో స్థిరపడిన ఆమె, ‘ చెరిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్’ అనే సంస్థను నిర్వహిస్తూ భారతీయ నృత్యాన్ని బోధిస్తున్నారు. ఈ డ్యాన్స్ స్కూల్ (Dance School)  విద్యార్థులతో కలిసి “అవురా అమ్మక చెల్లా” పాటకు ఆమె మళ్లీ స్టెప్పులు వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో 62 ఏళ్ల వయసులో కూడా ఆమె చూపించిన గ్రేస్, భావ వ్యక్తీకరణ, స్టెప్పులలో క్లారిటీ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. “వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే” అనే మాటకు మీనాక్షి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “అప్పటిలానే ఇప్పుడు కూడా అదే గ్రేస్, అదే చార్మ్” అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Meenakshi Seshadri Dance | 17 ఏళ్ల వయసులో మిస్ ఇండియా..

మీనాక్షి శేషాద్రి కేవలం గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, ఒక ప్రతిభావంతమైన క్లాసికల్ డ్యాన్సర్ కూడా. 17 ఏళ్ల వయసులో మిస్ ఇండియా (Miss India)  టైటిల్ గెలుచుకున్న ఆమె, భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ వంటి నృత్యరూపాల్లో నైపుణ్యం సంపాదించారు. హిందీ చిత్రాలలో ‘హీరో’, ‘దామిని’, ‘ఘాయల్’ వంటి సినిమాలతో అగ్ర కథానాయికగా ఎదిగిన ఆమె, తెలుగు ప్రేక్షకులకు ‘ఆపద్బాంధవుడు’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ వంటి చిత్రాల ద్వారా చిరస్థాయిగా గుర్తుండిపోయారు.1995లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ హరీష్ మైసూర్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. అనంతరం అమెరికాలో స్థిరపడి, తన జీవితాన్ని కుటుంబానికి ,నృత్యానికి అంకితం చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మళ్లీ అభిమానులకు దగ్గరవుతూ, భారతీయ సంస్కృతిని విదేశాల్లో ప్రాచుర్యం పొందేలా కృషి చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Yes Digital Telugu News (@yesdigitaltelugunews)

ఇది కూడా చదవండి..: Singer Mangli Statement | నేను ఏ తప్పు చేయలేదు.. సింగర్​ మంగ్లీ

 

Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
Singer Mangli | మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదు 
Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
Actress Suicide Case | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి సూసైడ్..
Jananayagan HD Leak | విడుదలకు ముందే ‘జననాయగన్’ హెచ్‌డీ లీక్.. లీకు వీరుల‌ని అరెస్ట్ చేసిన పోలీసులు
TAGGED:AapadbandhavuduDance SchoolDirector K. ViswanathMeenakshi Seshadri DanceMegastar ChiranjeeviMiss India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jubilee Hills Hit Run Jubilee Hills Hit Run | జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్​ కుమారుడు!
Next Article KKR Playoff Chances KKR Playoff Chances | దారుణంగా నిరాశ‌ప‌రుస్తున్న కేకేఆర్.. ఇక ప్లే ఆఫ్ ఆశ‌లు వదులుకున్న‌ట్టేనా ?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?