అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Meenakshi Seshadri Dance | నేటి టెక్నాలజీ యుగంలో పాత జ్ఞాపకాలను కొత్తగా మలచడం ఒక ట్రెండ్‌గా మారింది. ఈ ట్రెండ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుతూ, 80–90 దశకాల్లో భారతీయ సినీ రంగంలో ‘డ్యాన్సింగ్ క్వీన్’గా పేరు తెచ్చుకున్న మీనాక్షి శేషాద్రి తాజాగా చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెటిజన్లను మంత్ర ముగ్ధులను చేస్తోంది.
1992లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), దర్శకుడు కె. విశ్వనాథ్ (Director K. Viswanath) కలయికలో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘ఆపద్బాంధవుడు’ (Aapadbandhavudu)లోని “అవురా అమ్మక చెల్లా” పాట అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు-మనాలి మంచు కొండల మధ్య చిత్రీకరించిన ఈ పాటలో మీనాక్షి శేషాద్రి చేసిన శాస్త్రీయ నృత్యం ప్రేక్షకులను అలరించింది.
Meenakshi Seshadri Dance | అదే గ్రేస్…
ఇప్పుడు సరిగ్గా 34 ఏళ్ల తర్వాత, అదే పాటను మీనాక్షి మళ్లీ రీ-క్రియేట్ చేయడం విశేషం. ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్‌లో స్థిరపడిన ఆమె, ‘ చెరిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్’ అనే సంస్థను నిర్వహిస్తూ భారతీయ నృత్యాన్ని బోధిస్తున్నారు. ఈ డ్యాన్స్ స్కూల్ (Dance School) విద్యార్థులతో కలిసి “అవురా అమ్మక చెల్లా” పాటకు ఆమె మళ్లీ స్టెప్పులు వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో 62 ఏళ్ల వయసులో కూడా ఆమె చూపించిన గ్రేస్, భావ వ్యక్తీకరణ, స్టెప్పులలో క్లారిటీ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. “వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే” అనే మాటకు మీనాక్షి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “అప్పటిలానే ఇప్పుడు కూడా అదే గ్రేస్, అదే చార్మ్” అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Meenakshi Seshadri Dance | 17 ఏళ్ల వయసులో మిస్ ఇండియా..
మీనాక్షి శేషాద్రి కేవలం గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, ఒక ప్రతిభావంతమైన క్లాసికల్ డ్యాన్సర్ కూడా. 17 ఏళ్ల వయసులో మిస్ ఇండియా (Miss India) టైటిల్ గెలుచుకున్న ఆమె, భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ వంటి నృత్యరూపాల్లో నైపుణ్యం సంపాదించారు. హిందీ చిత్రాలలో ‘హీరో’, ‘దామిని’, ‘ఘాయల్’ వంటి సినిమాలతో అగ్ర కథానాయికగా ఎదిగిన ఆమె, తెలుగు ప్రేక్షకులకు ‘ఆపద్బాంధవుడు’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ వంటి చిత్రాల ద్వారా చిరస్థాయిగా గుర్తుండిపోయారు.1995లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ హరీష్ మైసూర్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. అనంతరం అమెరికాలో స్థిరపడి, తన జీవితాన్ని కుటుంబానికి ,నృత్యానికి అంకితం చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మళ్లీ అభిమానులకు దగ్గరవుతూ, భారతీయ సంస్కృతిని విదేశాల్లో ప్రాచుర్యం పొందేలా కృషి చేస్తున్నారు.
View this post on Instagram
ఇది కూడా చదవండి..: Singer Mangli Statement | నేను ఏ తప్పు చేయలేదు.. సింగర్ మంగ్లీ
