అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KKR Playoff Chances | ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్‌కు ఇది ఐదో పరాజయం కావడం గమనార్హం. అజింక్య రహానే సారథ్యంలో ఉన్న కేకేఆర్ ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఒక పాయింట్ మాత్రమే ఆ జట్టు ఖాతాలో ఉంది. దీంతో ప్రస్తుతం -1.149 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.
KKR Playoff Chances | ప్లేఆఫ్స్ ఆశలు లేనట్లేనా..!
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టుకు ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green) కీలక ఆధారంగా నిలిచాడు. 55 బంతుల్లో 79 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన గ్రీన్, జట్టును గౌరవప్రదమైన స్కోరు దిశగా నడిపించాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో కేకేఆర్ 180 పరుగులకు ఆలౌట్ అయింది.181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 86 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. అతని సమర్థవంతమైన బ్యాటింగ్‌తో గుజరాత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో ముందంజలో నిలిచింది.
KKR Playoff Chances | అత్యంత క్లిష్టంగా కేకేఆర్ పరిస్థితి
ప్రస్తుతం కేకేఆర్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. అయితే గణాంకాల ప్రకారం ఇంకా ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా ముగియలేదు. కేకేఆర్ ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటన్నింటిలోనూ గెలిస్తే 17 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఒకవేళ ఏడు మ్యాచ్‌లు గెలిచినా 15 పాయింట్లతో అవకాశాలు ఉండొచ్చు. కానీ మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడితే 13 పాయింట్లతో మిగిలి, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. మూడు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ ఈ సీజన్‌లో ఇంత పేలవ ప్రదర్శన చేయడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో జట్టు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. లేకపోతే ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా మసకబారే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి..: Jasprit Bumrah Form | బుమ్రా ఫామ్‌పై విమర్శలు.. ఇంత వరకు ఒక్క వికెట్ కూడా తీయకపోవడంపై కోచ్ ఆసక్తికర కామెంట్స్
