Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KKR Playoff Chances | దారుణంగా నిరాశ‌ప‌రుస్తున్న కేకేఆర్.. ఇక ప్లే ఆఫ్ ఆశ‌లు వదులుకున్న‌ట్టేనా ?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - KKR Playoff Chances | దారుణంగా నిరాశ‌ప‌రుస్తున్న కేకేఆర్.. ఇక ప్లే ఆఫ్ ఆశ‌లు వదులుకున్న‌ట్టేనా ?

క్రీడలు

KKR Playoff Chances | దారుణంగా నిరాశ‌ప‌రుస్తున్న కేకేఆర్.. ఇక ప్లే ఆఫ్ ఆశ‌లు వదులుకున్న‌ట్టేనా ?

ఐపీఎల్ 2026లో కేకేఆర్ పరాజయాల పరంపర కొనసాగుతుండగా, గుజరాత్ టైటాన్స్ చేతిలో మరో ఓటమితో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 18, 2026 10:06 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
23 గంటలు ago
Share
KKR Playoff Chances

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KKR Playoff Chances | ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)  నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

Contents
  • KKR Playoff Chances | ప్లేఆఫ్స్ ఆశ‌లు లేన‌ట్లేనా..!
    • KKR Playoff Chances | అత్యంత క్లిష్టంగా కేకేఆర్ పరిస్థితి

ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్‌కు ఇది ఐదో పరాజయం కావడం గమనార్హం. అజింక్య రహానే సారథ్యంలో ఉన్న కేకేఆర్ ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. పంజాబ్ కింగ్స్‌ (Punjab Kings)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఒక పాయింట్ మాత్రమే ఆ జట్టు ఖాతాలో ఉంది. దీంతో ప్రస్తుతం -1.149 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.

KKR Playoff Chances | ప్లేఆఫ్స్ ఆశ‌లు లేన‌ట్లేనా..!

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టుకు ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green) కీలక ఆధారంగా నిలిచాడు. 55 బంతుల్లో 79 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన గ్రీన్, జట్టును గౌరవప్రదమైన స్కోరు దిశగా నడిపించాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో కేకేఆర్ 180 పరుగులకు ఆలౌట్ అయింది.181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 86 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. అతని సమర్థవంతమైన బ్యాటింగ్‌తో గుజరాత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో ముందంజలో నిలిచింది.

KKR Playoff Chances | అత్యంత క్లిష్టంగా కేకేఆర్ పరిస్థితి

ప్రస్తుతం కేకేఆర్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. అయితే గణాంకాల ప్రకారం ఇంకా ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా ముగియలేదు. కేకేఆర్ ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటన్నింటిలోనూ గెలిస్తే 17 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఒకవేళ ఏడు మ్యాచ్‌లు గెలిచినా 15 పాయింట్లతో అవకాశాలు ఉండొచ్చు. కానీ మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడితే 13 పాయింట్లతో మిగిలి, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. మూడు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ ఈ సీజన్‌లో ఇంత పేలవ ప్రదర్శన చేయడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో జట్టు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. లేకపోతే ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా మసకబారే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి..: Jasprit Bumrah Form | బుమ్రా ఫామ్‌పై విమర్శలు.. ఇంత వ‌ర‌కు ఒక్క వికెట్ కూడా తీయ‌క‌పోవ‌డంపై కోచ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Jasprit Bumrah Injury | ఐపీఎల్ 2026కు ముందు ముంబై ఇండియన్స్‌కు బిగ్‌ షాక్.. గాయంతో ఐపీఎల్ నుంచి బుమ్రా ఔట్..?
Finn Allen 33 Ball Century | ఈడెన్ గార్డెన్స్‌లో కివీస్ తుపాను ఇన్నింగ్స్.. మ‌ళ్లీ ‘ఛోకర్స్’గా సౌతాఫ్రికా
T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన‌ భారత్.. న‌మోదైన రికార్డులు ఇవే..!
Sri Lanka Defeat | ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లంకకి ఘోర‌ అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు
India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..
TAGGED:Cameron GreenGujarat TitansKKR Playoff ChancesKolkata Knight Ridersnarendra modi stadiumPunjab Kings
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Meenakshi Seshadri Dance Meenakshi Seshadri Dance | 62 ఏళ్ల వయసులోనూ అదే గ్రేస్.. ‘అవురా అమ్మక చెల్లా పాట‌’కు మీనాక్షి శేషాద్రి రీ-క్రియేషన్ వైరల్!
Next Article Strait of Hormuz Tensions Strait of Hormuz Tensions | హ‌ర్మూజ్‌లో నౌక‌ల రాకపోక‌ల‌కు అనుమ‌తి.. యూఎస్ దిగ్బంధనం కొనసాగిస్తే మళ్లీ మూసేస్తామన్న ఇరాన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?