అక్షరటుడే, కోటగిరి: Women Reservation Bill Protest | భారత ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజని బీజేపీ మండల అధ్యక్షుడు కల్లూరి బజరంగ్ (హన్మాండ్లు) అన్నారు. పోతంగల్ మండల (Pothangal Mandal) కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Women Reservation Bill Protest | కుట్రపూరితంగా బిల్లును అడ్డుకుంటున్నారు
బజరంగ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మహిళలకు 33శాతం రిజర్వేషన్లతో, మహిళా బిల్లు అమలుకు మహిళల అభ్యున్నతికి బాటలు వేస్తుంటే కాంగ్రెస్, ఇండికూటమి కుట్రపూరితంగా దానిని అడ్డుకుందన్నారు. ప్రతిపక్షాలు అంతా కలిసి 145కోట్ల జనాభాలో 52శాతం మహిళలు ఉండగా వారికి న్యాయంగా అందాల్సిన 33శాతం రిజర్వేషన్లను అన్యాయంగా అడ్డుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) దృష్టిలో మహిళలంటే ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీలేనని.. డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill) సాకుతో, ఎక్కడ మహిళలు చట్టసభల్లోకి అడుగుపెట్టి బీజేపీ (BJP)కి క్రెడిట్ ఇస్తారో అన్న అక్కసుతో ఈ బిల్లు నిలిపివేయించారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓబీసీ అధికార ప్రతినిధి, మక్కయ్య, గంగాధర్ పటేల్, ప్రకాష్ పటేల్, పబ్బ శేఖర్, నాగయ్య, సుధాకర్ గౌడ్, లక్ష్మణ్ పటేల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kalyana Lakshmi Gold Scheme | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాల్సిందే.. : ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
