అక్షరటుడే, గాంధారి: Wife Suicide Over Scolding | భర్త తిట్టాడనే కోపంతో భార్య క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గాంధారి మండలం (Gandhari Mandal)లోని బీరుమల్తండాలో శనివారం చోటు చేసుకుంది.
Wife Suicide Over Scolding | భర్త తిట్టాడని.. పురుగుల మందు తాగి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని బీరుమల్తండా (Beerumalthanda) గ్రామానికి చెందిన చెందిన జ్యోతి (28) తన భర్త తిట్టాడని కోపంతో శుక్రవారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు, చుట్టుపక్కల వారు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆమెను గాంధారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ (Nizamabad)లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అయితే రాత్రి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ జ్యోతి మరణించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీలకు అప్పగించామని పోలీసులు తెలిపారు. జ్యోతి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మహేందర్ తెలిపారు.
ఇది కూడా చదవండి..: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు రజనీకాంత్‌కు సన్మానం
