Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Women Rights Protest | మహిళా హక్కులను కాంగ్రెస్​ కాలరాస్తోంది..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Women Rights Protest | మహిళా హక్కులను కాంగ్రెస్​ కాలరాస్తోంది..

నిజామాబాద్

Women Rights Protest | మహిళా హక్కులను కాంగ్రెస్​ కాలరాస్తోంది..

దేశంలో మహిళా హక్కులను కాంగ్రెస్​ పార్టీ కాలరాస్తోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. మహిళా రిజర్వేషన్​ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఆ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 18, 2026 5:55 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Women Rights Protest

అక్షరటుడే, బాన్సువాడ: Women Rights Protest | దేశంలో మహిళా హక్కులను కాంగ్రెస్​ పార్టీ కాలరాస్తోందని.. కక్షపూరితంగా వ్యవహరిస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా బిల్లును అడ్డుపడిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు పట్టణంలోని అంబేడ్కర్​ చౌరస్తాలో శనివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Contents
  • Women Rights Protest | నారీశక్తి వందన్​ చట్టాన్ని నీరుగార్చారు..
    • Women Rights Protest | రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​కు బుద్ధి చెప్పాలి

Women Rights Protest | నారీశక్తి వందన్​ చట్టాన్ని నీరుగార్చారు..

కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీసుకువచ్చిన నారీశక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తుచేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకున్న ఈ నిర్ణయానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించిందన్నారు. అయితే పార్లమెంటులో ఈ బిల్లుకు కాంగ్రెస్ కూటమి ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయడం మహిళల సాధికారతకు విరుద్ధమని విమర్శించారు. మహిళల హక్కులను కాపాడాల్సిన పార్టీలు ఇలాంటి కీలక అంశాల్లో వ్యతిరేకంగా నిలవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

Women Rights Protest | రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​కు బుద్ధి చెప్పాలి

రాబోయే ఎన్నికల్లో మహిళలు తమ ఓటుతో తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను విపక్షాలు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ (BJP) జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చిదుర సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ గజ్జల మహేష్, పాశం ఆమని, భాస్కర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు అనిల్, సిద్ది బాలరాజ్, రామకృష్ణ, రూరల్ అధ్యక్షుడు మజ్జిగ శ్రీనివాస్, మహిళా నాయకులు రేణుక, విజయలక్ష్మి, లక్ష్మీ, ఐశ్వర్య, యమున, సవిత, లావణ్య, సారిక, అంకిత పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Armur Illegal Activities | ఆర్మూర్​ బల్దియా పరిధిలో అక్రమలను అరికట్టాలి..: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

Seethakka Legal Notice | కేసీఆర్​కు మంత్రి సీతక్క లీగల్​ నోటీసులు
PDSU National Committee | పీడీఎస్​యూ జాతీయ కమిటీ సభ్యుడిగా అనుముల రవీందర్
Indian Family System | భారతదేశంలో కుటుంబ వ్యవస్థ గొప్పది: గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ
Domestic Cylinders Seized | హోటల్​లో డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసిన అధికారులు
Gas Cylinder Black Market | అక్రమంగా తరలిస్తున్న గ్యాస్ సిలిండర్ల పట్టివేత
TAGGED:banswada protestBJPbjp newsBJP vs CongressCentral Governmentnarishakti vandan actPM Narendra Modipolitical protest IndiaTelangana Politicswomen reservation billwomen rightsWomen Rights Protest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Armoor Illegal Activities Armoor Illegal Activities | ఆర్మూర్​ బల్దియా పరిధిలో అక్రమాలను అరికట్టాలి : ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Next Article MPTC ZPTC Elections MPTC ZPTC Elections | త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?