Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Road Accidents Awareness | రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలి: సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Road Accidents Awareness | రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలి: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

Road Accidents Awareness | రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలి: సీపీ సాయిచైతన్య

ట్రాఫిక్​ నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ఎడపల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలోని మంగల్​పాడ్​ చౌరస్తా వద్ద ప్రజలకు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 18, 2026 5:24 సా.
Shashi kiran Mottala
3 రోజులు ago
Share
Road Accidents Awareness |
Road Accidents Awareness | రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలి: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, బోధన్​: Road Accidents Awareness | ట్రాఫిక్​ నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీ సాయిచైతన్య(CP Sai chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు ఎడపల్లి (Yedapally) పోలీస్​స్టేషన్​ పరిధిలోని మంగల్​పాడ్​ చౌరస్తా వద్ద ప్రజలకు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Contents
  • Road Accidents Awareness | ట్రాఫిక్​ నియమాలు తూచా తప్పకుండా పాటించాలి..
    • Road Accidents Awareness | అతివేగం.. నిర్లక్ష్యం..

Road Accidents Awareness | ట్రాఫిక్​ నియమాలు తూచా తప్పకుండా పాటించాలి..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ట్రాఫిక్​ నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్​ అలైవ్(Arrive Alive)​ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీంట్లో భాగంగా 6వరోజు శనివారం అవగాహన కార్యక్రమాన్ని ఎడపల్లిలో జరుపుతున్నామన్నారు. ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరి ద్వారా రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు.

Road Accidents Awareness | అతివేగం.. నిర్లక్ష్యం..

రోడ్డుపై అతివేగం.. నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు పెరుగుతున్నాయని సీపీ అన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం , డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడంతోనే ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయ్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్​లో(Golden Hour) ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఎవరైతే హాస్పిటల్ తరలిస్తారో, అతనికి ప్రభుత్వం నుంచి ప్రోతాసహం రూ.25వేలు అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై రమ, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది తదితరులున్నారు.

 

ఇది కూడా చదవండి : MPTC ZPTC Elections | త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

Drunk Driving Case | డ్రంకన్ డ్రైవ్ కేసులో పలువురికి జైలుశిక్ష
Municipal Workers Protest | వేతనాలు అడిగితే కేసులు పెడతారా..? కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల ధర్నా
Mahalakshmi scheme success | మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్యే పోచారం
Banswada Police | పోషించలేమని.. ఆడ శిశువును అమ్మేసిన తల్లిదండ్రులు
SSC CGL | ఎస్​ఎస్​సీ కంబైన్డ్​ గ్రాడ్యుయేట్​ లెవల్​ పరీక్షల్లో ఇందూరు యువకుడికి 102వ ర్యాంక్​..
TAGGED:accident preventionbodhan newsCP Saichaitanyadefensive drivingroad safetyTelangana Policetraffic awarenessTraffic RulesYedapally
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article MPTC ZPTC Elections MPTC ZPTC Elections | త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
Next Article Secretariat Protest Secretariat Protest | సచివాలయాన్ని ముట్టడించిన మలిదశ ఉద్యమకారుల అరెస్ట్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?