Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 15 Pre Market Analysis | శాంతి చర్చలపై ఆశలు.. పాజిటివ్‌గా స్టాక్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 15 Pre Market Analysis | శాంతి చర్చలపై ఆశలు.. పాజిటివ్‌గా స్టాక్ మార్కెట్లు

బిజినెస్​తాజా వార్తలు

April 15 Pre Market Analysis | శాంతి చర్చలపై ఆశలు.. పాజిటివ్‌గా స్టాక్ మార్కెట్లు

ఆసియా మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సైతం పాజిటివ్‌గా ఉంది. దీంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అఫ్ లో ప్రారంభం కానున్నాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 15, 2026 8:08 ఉద.
Naresh chandan
1 రోజు ago
Share
April 15 Pre Market Analysis
April 15 Pre Market Analysis

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 15 Pre Market Analysis | అమెరికా -ఇరాన్‌ల మధ్య మళ్లీ చర్చలు జరుగుతాయన్న ఆశలు చిగురిస్తుండడంతో చమురు ధరలు తగ్గుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. గత సెషన్‌లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్‌గా ముగియగా.. బుధవారం ఉదయం ఆసియా స్టాక్ మార్కెట్ సైతం లాభాల బాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ భారీ లాభాలతో ఉంది. ఇది దేశీయ స్టాక్ మార్కెట్ గ్యాప్ అప్‌లో ప్రారంభమవుతుందని సూచిస్తోంది.

Contents
  • April 15 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
    • April 15 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
      •  April 15 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..
      • గమనించాల్సిన అంశాలు..

April 15 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1.96 శాతం, ఎస్అండ్ పీ 1.18 శాతం లాభపడగా.. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.15 శాతం లాభంతో ఉంది.

April 15 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.26 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.10 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.25 శాతం పెరిగాయి.

 April 15 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 8.15 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.86 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.02 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.27 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.50 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.46 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.43 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 1.38 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,983 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 31వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,432 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.13 వద్ద స్థిరంగా ఉంది.
  • విక్స్ 8.75 శాతం పెరిగి 20.5 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.18 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.25 వద్ద ఉన్నాయి.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.28 శాతం తగ్గి 94.56 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 64 పైసలు బలహీనపడి 93.38 వద్ద ఉంది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి 2026-2027లో భారత ఆర్థిక వ్యవస్థ గతంలో అంచనా వేసిన దానికంటే వేగంగా వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అమెరికా -ఇరాన్ యుద్ధ సంక్షోభం ఉన్నప్పటికీ, జనవరిలో చేసిన తన మునుపటి అంచనా 6.4 శాతంతో పోలిస్తే భారతదేశ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. కాగా ఐఎంఎఫ్ 2026 నాటికి తన వృద్ధి అంచనాను 3.1 శాతం వాస్తవ జీడీపీ వృద్ధికి తగ్గించింది. ఇది జనవరిలో చేసిన మునుపటి అంచనా కంటే 0.2 శాతం పాయింట్లు తక్కువ.

భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో స్వల్పంగా పెరిగి 3.4 శాతానికి చేరింది. ఇది అంతకుముందు నెలలో 3.21 శాతంగా ఉంది. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4శాతం మధ్యస్థ లక్ష్యంకంటే మార్చి సీపీఐ ఇన్ఫ్లెషన్ తక్కువగానే ఉంది.

ఇది కూడా చదవండి:

ఇది కూడా చదవండి: Bilva Patra | బిల్వపత్రం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. త్రిమూర్తి తత్వానికి ఇది ఎలా ప్రతీకంటే!

ఇది కూడా చదవండి: Karna | కర్ణ మరణం నుంచి కష్టాల వరకు.. ‘సవాలక్ష’ అనే పదం ఎలా వచ్చిందంటే!

Kavitha Arrest Narsingi | నార్సింగ్​లో ఉద్రిక్తత.. కల్వకుంట కవిత అరెస్టు!
Stock Market Fall | వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
April 10 Pre Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ
Gold Rate April 14 | అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
TAGGED:april 15 market analysisApril 15 Pre Market Analysisgift nifty updateglobal market cuesindian economy outlooknifty prediction todaypre market report indiashare market newsstock market today india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Temple Hair Rules Temple Hair Rules | ఆ సమయంలో జుట్టు విరబోసుకోవద్దట… ఎందుకంటే!
Next Article April 15 Gold Rates | ఎగసిపడుతున్న బంగారం ధర.. లక్షన్నర దాటి ముందుకు! April 15 Gold Rates | పెరుగుతున్న బంగారం ధర.. లక్షన్నర దాటి ముందుకు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?