అక్షరటుడే, ఇందూరు: Dehydration Prevention | వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, డీహైడ్రేషన్ కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని లేకపోతే వడదెబ్బ కారణంగా శరీరంతో పాటు మెదడుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని మెడికవర్ ఆస్పత్రి న్యూరో ఫిజీషియన్ మోసిన్ అన్నారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వివరాలు వెల్లడించారు.
Dehydration Prevention | వృద్ధులు.. చిన్నారులు..
ముఖ్యంగా వేసవిలో వృద్ధులు, బీపీ (Blood Pressure), షుగర్ (Diabetes), హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ మోసిన్ సూచించారు. చిన్నారులను ఎండలో తిప్పకపోవడమే మంచిదని.. అత్యవసర పరిస్థితుల్లోనే వారిని బయటకు తీసుకెళ్లాలన్నారు. వేసవిలో శరీరంలో నీరు (Dehydration) తగ్గడం వల్ల మెదడుకు సరిపడ రక్త ప్రసరణ తగ్గి తలనొప్పి, తల తిరగడం, అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. తీవ్రమైన పరిస్థితుల్లో హీట్ స్ట్రోక్ (Heat Stroke), బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) వంటి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
Dehydration Prevention | మైగ్రేన్ సమస్యలు ఉంటే..
మైగ్రేన్ (Migraine) సమస్య ఉన్నవారిలో వేసవిలో లక్షణాలు మరింత పెరుగుతాయని, ఎక్కువ వెలుతురు, వేడి వాతావరణం కారణంగా తీవ్ర తలనొప్పులు రావచ్చని వైద్యుడు వివరించారు. అలాగే మూర్ఛ వ్యాధి (Epilepsy) ఉన్న రోగులు మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం, నీటిలోపం రాకుండా జాగ్రత్తపడడం చాలా ముఖ్యమని తెలిపారు.
Dehydration Prevention | ఈ లక్షణాలు..
తలనొప్పి, తల తిరగడం, కళ్ల ముందు చీకటి కనిపించడం, ఒక్కసారిగా చేతులు లేదా కాళ్లు బలహీనంగా మారడం, మాట తడబడడం లేదా మాట్లాడడంలో ఇబ్బంది, గందరగోళం, స్పృహ కోల్పోవడం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరమని డాక్టర్ హెచ్చరించారు.
Dehydration Prevention | సూచనలు.. సలహాలివే..
ఈ సందర్భంగా ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. రోజుకు కనీసం 3–4 లీటర్ల నీరు తాగాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లడం తగ్గించాలని.. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపీ, గొడుగు ఉపయోగించాలన్నారు. తేలికపాటి, పోషకాహారం తీసుకోవాలి (పండ్లు, కొబ్బరి నీరు, మజ్జిగ) తీసుకుంటే బాగుంటుందన్నారు. కాఫీ, టీ, ఆల్కహాల్ వంటి పానీయాలను తగ్గించాలని.. బీపీ, షుగర్ ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలని పేర్కొన్నారు. సరిపడా నిద్ర తీసుకోవడం కూడా అవసరమన్నారు.
ఇది కూడా చదవండి..: Foot Fingers Personality | వామ్మో.. అర చేతి రేఖలే కాదు.. పాదాల వేళ్లు కూడా భవిష్యత్తును నిర్ణయిస్తాయట!
