Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: TGEJAC Protest | కలెక్టరేట్​లో టీజీఈజేఏసీ​ ఆధ్వర్యంలో నిరసన.. జూన్​ 2 లోపు పీఆర్సీ అమలుకు డిమాండ్​..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - TGEJAC Protest | కలెక్టరేట్​లో టీజీఈజేఏసీ​ ఆధ్వర్యంలో నిరసన.. జూన్​ 2 లోపు పీఆర్సీ అమలుకు డిమాండ్​..

నిజామాబాద్

TGEJAC Protest | కలెక్టరేట్​లో టీజీఈజేఏసీ​ ఆధ్వర్యంలో నిరసన.. జూన్​ 2 లోపు పీఆర్సీ అమలుకు డిమాండ్​..

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో ప్రభుత్వ ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 6:14 సా.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
TGEJAC Protest |
TGEJAC Protest | కలెక్టరేట్​లో టీజీఈజేఏసీ​ ఆధ్వర్యంలో నిరసన.. జూన్​ 2 లోపు పీఆర్సీ అమలుకు డిమాండ్​..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ/భీమ్​గల్: TGEJAC Protest | జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో ప్రభుత్వ ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు.  తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఈజేఏసీ రాష్ట్ర అడిషనల్​ సెక్రెటరీ జనరల్​​ పులగం దామోదర్​ రెడ్డి హాజరయ్యారు.

Contents
  • TGEJAC Protest | ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు..
    • TGEJAC Protest | డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి..: నాశెట్టి సుమన్​ కుమార్​

TGEJAC Protest | ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు..

ఈ సందర్భంగా దామోదర్​ రెడ్డి మాట్లాడుతూ.. జూన్​ 2వ తేదీ లోపల పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ ఉద్యమ అనంతరం పదేళ్లుగా ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు అధ్యక్షతన, 206 పైగా భాగస్వామ్య సంఘాలతో టీజీఈజేఏసీ స్థాపించి, పలుమార్లు 69 పైగా డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేశామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యలను పెడచెవిన పెట్టాయన్నారు.  పీఆర్​సీ కమిటీ వేసి 30 నెలల గడుస్తున్నా నేటికీ నివేదిక తెప్పించుకోకపోవడం విడ్డూరమన్నారు.

అతి త్వరగా 51శాతం శాతం ఫిట్​మెంట్​తో 2వ పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఉద్యోగులకు రూ.13 వేల కోట్లకు పైగా బకాయి పడ్డ పెండింగ్ బిల్లులన్నింటిని ఏకమొత్తంగా విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేస్తూ, ఆరోగ్య కార్డులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.  సెప్టెంబర్ 2004 తర్వాత నియమించబడిన ఉద్యోగులందరికీ సీపీఎస్​ స్కీం రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, వీటితోపాటు మిగతా 64 డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరారు.

TGEJAC Protest | డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి..: నాశెట్టి సుమన్​ కుమార్​

టీజీఈజేఏసీ జిల్లా ఛైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించిన  ముఖ్యమైన నాలుగు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యమ కార్యచరణను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనికి గాను ఉద్యోగులందరూ సమాయత్తం కావాలన్నారు. కార్యక్రమంలో కమిటీ జిల్లా కో–కన్వీనర్ మోహన్ రెడ్డి, కో –ఛైర్మన్లు రమేష్, రమణ్​ రెడ్డి, ధర్మేందర్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సురేష్, పండరీ నాథ్, వైస్ ఛైర్మన్లు విజయ్ సింగ్, శేఖర్, అమృత్ కుమార్,  ప్రశాంత్, మోహన్, ఫైనాన్స్ సెక్రెటరీ జాకీర్ హుస్సేన్, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, అంగన్​వాడీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.

tgho

 

ఇది కూడా చదవండి..: Telangana Jagruthi Posters | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ

Arunodaya State Conference | ప్రజల్ని చైతన్యం చేయడానికి అరుణోదయ కృషి
Women Reservation 2029 | మహిళలకు రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం.. 2029 ఎన్నికల నాటికి అమలు: ఎంపీ అర్వింద్​
Nidhi Agarwal Nizamabad | ఇందూరులో మెరిసిన ’నిధి’
Pochampad | పోచంపాడ్‌లో కత్తిపోట్ల కలకలం.. యువకుడి మృతి
ASHA Workers Strike | ఆశావర్కర్ల సమ్మెకు బీఆర్​ఎస్​ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే బిగాల
TAGGED:collectorate protestEmployee DemandsGovernment Employeesprotest newsTelangana EmployeesTelangana newsTGEJACTNGOsTNGOs ProtestUnion Activities
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Dehydration Prevention Dehydration Prevention | వేసవిలో డీహైడ్రేషన్​ కాకుండా జాగ్రత్తలు పాటించాలి: మెడికవర్​ ఆస్పత్రి న్యూరో ఫిజీషియన్​ మోసిన్​
Next Article Rahul Gandhi Rahul Gandhi | రాహుల్ గాంధీకి షాక్​.. బ్రిటిష్ పౌరసత్వంపై ఎఫ్​ఐఆర్​, విచారణకు లక్నో హైకోర్టు ఆదేశం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?