అక్షరటుడే, వెబ్డెస్క్: DOST Notification 2026 | తెలంగాణ (Telangana)లో దోస్త్ నోటిఫికేషన్ విడుదల అయింది. 2026–27 విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణారెడ్డి సోమవారం విడుదల చేశారు.
రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఆదివారం విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ తర్వాత విద్యార్థులు డిగ్రీ, బీటెక్, ఎంబీబీఎస్ బీ ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సులు చేస్తారు. బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల కోసం ఈఏపీ సెట్, ఎంబీబీఎస్ కోసం నీట్ పరీక్షలు (NEET Exams) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను ఆన్లైన్లో దోస్త్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం చేపడుతోంది.
DOST Notification 2026 | మూడు దశల్లో
దోస్త్ రిజిస్ట్రేషన్ (DOST Registration), సీట్ల కేటాయింపు ప్రక్రియ మూడు దశల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు తొలిదశ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అవకాశం ఉంది. మే 14న సీట్లు కేటాయించారు. తొలిదశలో సీటు వచ్చిన వారు మే 15 నుంచి 23 వరకు రిపోర్టు చేయాలి.
DOST Notification 2026 | సెకండ్ ఫేజ్..
దోస్త్ రెండో దశ రిజిస్ట్రేషన్ మే 15 నుంచి మే 25 వరకు కొనసాగనుంది. మే 15 నుంచి మే 26 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మే 30న సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. సీటు లభించిన వారు మే 31 నుంచి జూన్ 5 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మూడో దశలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 31 జూన్ 15 వరకు నిర్వహిస్తారు. మే 31 నుంచి జూన్ 16 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. జూన్ 20న సీట్లు కేటాయిస్తారు. జూన్ 20 నుంచి జూన్ 25 వరకు ఆన్లైన్లో రిపోర్టు చేయాలి.
ఇది కూడా చదవండి..: Revanth Reddy Letter | అఖిలపక్ష భేటీ పెట్టాలి.. ప్రధానికి సీఎం రేవంత్రెడ్డి లేఖ
