అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jagan Targets Chandrababu | రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. నెల్లూరు జిల్లా (Nellore District) జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను బుధవారం పరిశీలించారు. అనంతరం స్థానిక మత్స్యకారులతో ముఖాముఖీ నిర్వహించారు. వారి కష్టాలను తెలుసుకున్నారు.
జగన్ మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టులకు శ్రీకారం చుట్టామన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఫిషింగ్ హార్బర్లు ప్రారంభించామని తెలిపారు. రామాయపట్నం పోర్టు (Ramayapatnam Port) పనులు 95 శాతం పూర్తి చేశామని, శ్రీకాకుళంలోని మూలాపేట పోర్టులో 35 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. రూ.26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
Jagan Targets Chandrababu | కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది
పోర్టుల్లో మిగిలిన పనులను పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని జగన్ ప్రశ్నించారు. జువ్వలదిన్నెలో 41 వేల టన్నుల మత్స్య సంపద దొరుకుతుందని తెలిపారు. ఈ పోర్టు పూర్తయి రెండేళ్లు అవుతున్నా.. మత్స్యకారులకు ఎందుకు అప్పగించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం వారి కడుపు కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం (YCP Government) వస్తుందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి రాగానే.. ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తామన్నారు.
ఇది కూడా చదవండి..: Nara Lokesh TDP Working President | టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియామకం
