Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sri Veda School | విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Sri Veda School | విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర..

నిజామాబాద్

Sri Veda School | విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర..

విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత కీలకమని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలోని (Kotagiri) శ్రీవేద పాఠశాల 11వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 14, 2026 9:32 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Sri Veda School |
Sri Veda School | విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర..

అక్షరటుడే,కోటగిరి : Sri Veda School | విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత కీలకమని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలోని (Kotagiri) శ్రీవేద పాఠశాల 11వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

Contents
  • Sri Veda School | చెడు అలవాట్లకు తొందరంగా అలవాటు..
    • Sri Veda School | చిన్నారుల భవిష్యత్తు కోసమే మందలింపులు..

Sri Veda School | చెడు అలవాట్లకు తొందరంగా అలవాటు..

నేటి సమాజంలో విద్యార్థులు చదువులకు దూరం కావడం.. చెడు అలవాట్లకు దగ్గర కావడం పరిపాటిగా మారిందని శ్రీహరి అన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు ప్రశంసించాలి కానీ పొగడకూడదని దీనివల్ల విద్యార్థులలో తప్పుడు అభిప్రాయాలు ఏర్పడతాయని ఆయన అన్నారు. విద్యార్థులకు చదువు క్రమశిక్షణ రెండు ఎంతో ముఖ్యమని అవి రెండు ఉన్నవారు మాత్రమే తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారని ఆయన అన్నారు. ఇందుకు నిదర్శనం సచిన్ టెండూల్కర్ అని వివరించారు. 32 సార్లు సెంచరీలు చేసిన 33వ సారి సున్నా పరుగుకలు వికెట్ కోల్పోయినప్పుడు తలదించుకొని వచ్చిన వ్యక్తి అని గుర్తు చేశారు.

Sri Veda School | చిన్నారుల భవిష్యత్తు కోసమే మందలింపులు..

తల్లిదండ్రులు, గురువులు మందలించేది చిన్నారుల భవిష్యత్తు కోసమేనని ఆయన గుర్తు చేశారు. నేటి సమాజంలో ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు సొంత పిల్లల కన్నా పాఠశాల చిన్నారులే ముఖ్యమని వారిని సైతం తమ పిల్లలుగానే భావిస్తారని ఇందుకు ఎన్నో ఉదాహరణలు చెప్పుకొచ్చారు. నేటి సమాజంలో తల్లిదండ్రులు గురువుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని విద్యార్థుల ముందే గురువులను అగౌరవపరుస్తున్నారని ఇది మంచి సంస్కృతి కాదన్నారు.

విద్యార్థులకు చదువులు గురువులు విద్యాసంస్థలు అన్న విలువలు పోవడానికి కారణం ఇలాంటి ఘటనలేనని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఎంతో మేధాసంపత్తి ఉంటుందని చెప్పుకొచ్చారు. పట్టణాలలోని విద్యాసంస్థలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల విద్యాసంస్థలే మెరుగైన విద్యను వ్యక్తిత్వంతో కూడిన విద్యను విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్థానిక ఎస్సై సునీల్, బోధన్(Bodhan) విద్యావికాస్ విద్యాసంస్థల  (Vidya Vikas Institutions) ఛైర్మన్ యార్లగడ్డ శ్రీనివాస్, ఉషోదయ విద్యాసంస్థల(Ushodaya Educational Institutions) ఛైర్మన్ సూర్య ప్రకాష్ రావు, శ్రీవేద పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్, కరస్పాండెంట్ తెల్ల అక్షర ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Lok Sabha Seats Increase | లోక్​సభ సీట్ల పెంపుపై ప్రధానికి సీఎం లేఖ

Kamarreddy District Court | స్నేహితుడి హత్య కేసులో అన్నదమ్ములకు జీవిత ఖైదు
Revanth Reddy Comments | సీఎం రేవంత్​రెడ్డిపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..
ASHA Workers Strike | ఆశావర్కర్ల సమ్మెకు బీఆర్​ఎస్​ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే బిగాల
Nizamabad Murder Case | గొడ్డలితో మెడపై నరికి.. నిజామాబాద్​లో యువకుడి దారుణ హత్య!
Property Tax Collections | ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలి
TAGGED:education disciplineKotagirimoral valuesparenting tipsparents roleschool educationStudent Developmentstudent succesteacher importanceUshodaya Educational InstitutionsVidya Vikas Institutions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Cholesterol Reducing Foods Cholesterol Reducing Foods | చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే సూపర్ ఫుడ్స్.. ప్రతిరోజు తింటే లాభాలే వేరు!
Next Article Hyderabad Police Transfers Hyderabad Police Transfers | హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?