అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CCS Police | ఆర్మూర్‌లో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు (nizamabad police) మెరుపు దాడి చేశారు. పేకాడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ వెల్లడించారు.
CCS Police | ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో..
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ (Armoor Police station) పరిధిలోని పెర్కిట్, తిరుమల గార్డెన్స్ ఫంక్షన్‌హాల్ పేకాట ఆడుతున్నట్లుగా పక్కా సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా పేకాడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మూడు కార్లు, ఆరు సెల్ఫోన్లు, రూ.1,17,940 స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అయితే ఈ పేకాట ఆడే బృందంలో ప్రముఖ నాయకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్మూర్ పట్టణానికి చెందిన ఓ కౌన్సిలర్, భైంసా మున్సిపాలిటీకి చెందిన మరో నాయకుడు పట్టుబడ్డట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Revanth Reddy Letter | అఖిలపక్ష భేటీ పెట్టాలి.. ప్రధానికి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
