అక్షరటుడే, వెబ్డెస్క్ : Multi Level Scam | రాష్ట్రంలో మరో మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్ (MLM) వెలుగు చూసింది. ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ పేద, మధ్యతరగతి ప్రజలకు శఠగోపం పెట్టింది. పెట్టుబడి పెట్టండి లాభాలు పొందండని సదరు సంస్థ ప్రచారం చేసింది. దీంతో ప్రజలు నమ్మి భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. ఇందులో ఎక్కువగా ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లావాసులు ఇన్వెస్ట్ చేశారు. డిపాజిట్లు, ప్రీమియం పేరిట సదరు సంస్థ దాదాపు రూ.800 కోట్లు వసూలు చేసింది.
Multi Level Scam | భారీగా లాభాలు వస్తాయని..
పెట్టుబడికి భారీ మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించింది. భారీగా డబ్బులు వసూలు చేసిన అనంతరం సంస్థ బోర్డు తిప్పేసింది. ఇటీవల కొన్ని రోజులుగా సంస్థ కార్యాలయానికి తాళం ఉండటంతో బాధితులు మోసపోయామని గ్రహించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Multi Level Scam | ఈజీ మనీ కోసం..
డబ్బులు ఊరికే రావని ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ యాడ్ ఉంటుంది. అలాగే లాభాలు సైతం ఊరికే రావు. కానీ చాలామంది ప్రజలు తక్కువ కాలంలో కోటీశ్వరులు కావాలని కలలు కంటున్నారు. కష్టం తెలియకుండా డబ్బులు రావాలని భావిస్తున్నారు. ఇలాంటి వారిని మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలు మోసం చేస్తున్నాయి. తమ వద్ద పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆ సంస్థలు నమ్మిస్తున్నాయి. అనంతరం ఇతరులను సంస్థలో చేర్పిస్తేనే డబ్బులు వస్తాయని చెబుతున్నాయి. తీరా కొన్ని రోజులు నడిపిన తర్వాత ప్రజల డబ్బులతో కంపెనీ ప్రతినిధులు పరారు అవుతున్నారు.
ఇలా అనేక కంపెనీలు బోర్డులు తిప్పేశాయి. అయినా ప్రజలు మోసపోతూనే ఉండటం గమనార్హం. పోలీసులు అవగాహన కల్పిస్తునన్ఆ.. చాలా మంది మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీల ఉచ్చులో పడుతున్నారు. ఇందులో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉంటున్నారు.
ఇది కూడా చదవండి : ATM Cash Theft | ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బులతో పరారైన సిబ్బంది
