అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR comments | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగరంలో సంతోషంగా ఉన్నది దోమలు, దొంగలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. నగరంలో ఎక్కడబడితే అక్కడ భూములు కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. ఓ పక్క సీఎం రేవంత్‌రెడ్డి, మరోపక్క మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కబ్జాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో దోమల బెడద తీవ్రంగా ఉందన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పేరును దోమలబాదు, దోమలగూడ అని పెట్టమని గతంలో అసెంబ్లీలో చెప్పానని గుర్తు చేశారు. కేసీఆర్‌ను బద్నాం చేసి హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలను కోరారు.
KTR comments | ఉప్పల్ ఫ్లై ఓవర్ పూర్తి చేయాలి
ఉప్పల్ ఫ్లై ఓవర్ (Uppal Fly over) భూమి పుట్టినప్పటి నుంచి నడుస్తోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం దీని పనులు చేపట్టి 8 ఏళ్లు అయిందని, ఎక్కడ పని అక్కడే ఉందన్నారు. ఫ్లై ఓవర్‌ను బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తామంటే మేమే కడతాం అన్నారని చెప్పారు.
KTR comments | మళ్లీ గెలుస్తాం
మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ (Medchal) మల్కాజిగిరి జిల్లాలో మూడు క్లిన్ స్వీప్ చేశామని కేటీఆర్ అన్నారు. మళ్లీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ ఎన్నికలు సెప్టెంబర్, అక్టోబరులో నిర్వహించే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే బుల్డోజర్ వస్తుందని, అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.
KTR comments | పోరాటం చేస్తాం
డీలిమిటేషన్ (Delimitation) పేరుతో బీజేపీ మరో కొత్త కుట్రకు తెరలేపుతోందని కేటీఆర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ ఆధ్యర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ అమలు చేశామని చెప్పారు.
దీనిని కూడా చదవండి : Telangana Heat Wave | మండుతున్న ఎండలు.. ఈ నాలుగు రోజులు జాగ్రత్త
