అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Turmeric price protest | నగరంలోని వ్యవసాయ మార్కెట్‌ను (Nizamabad Agricultural Market) రైతులు (turmeric farmers) ముట్టడించారు. ఈ మేరకు పసుపు కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ వారు అధికారులను ఘెరావ్ చేశారు.
Turmeric price protest | కొనుగోళ్లు నిలిపేయాలని డిమాండ్..
మార్కెట్‌కు ఈ మధ్య కాలంలో భారీగా పసుపు తరలివచ్చింది. సుమారు 50వేలకు పైగా పసుపు యార్డులో డంప్ అయ్యింది. అయితే ఆన్లైన్లో రూ.16వేలు క్వింటాల్ ధర ఉండగా.. మార్కెట్లో ఆఫ్‌లైన్‌లో మాత్రం రూ. 13వేలకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటాలుకు రూ.3వేల ధర తగ్గడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొనుగోళ్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Turmeric price protest | నిలిచిపోయిన కొనుగోళ్లు..
ఈ క్రమంలో మార్కెట్ కార్యాలయంలో ఫర్నీచర్‌ను రైతులు ధ్వంసం చేశారు. స్పందించిన అధికారులు కొనుగోళ్లను నిలిపివేశారు. ఆన్లైన్లోనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్, కలెక్టర్ (Collector Ila Tripathi) వచ్చాకే కొనుగోళ్లు ప్రారంభించాలని వారు కోరారు. దీంతో మార్కెట్‌యార్డులో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే యార్డుకు చేరుకున్నారు. రైతులను సముదాయించారు.

ఇది కూడా చదవండి: KTR comments | భూములు కబ్జా చేస్తున్న సీఎం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
