Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Surge | బుల్ దూకుడు.. భారీగా పెరిగిన సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Surge | బుల్ దూకుడు.. భారీగా పెరిగిన సూచీలు

బిజినెస్​

Stock Market Surge | బుల్ దూకుడు.. భారీగా పెరిగిన సూచీలు

అమెరికా -ఇరాన్‌ల మధ్య చర్చల పునరుద్ధరణపై ఆశలు చిగురించడంతో స్టాక్ మార్కెట్లు కళకళలాడాయి. సెన్సెక్స్ 1,263 పాయింట్లు, నిఫ్టీ 388 పాయింట్లు పెరిగాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 4:16 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Stock Market Surge

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Surge | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా -ఇరాన్ మరోసారి శాంతి చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు అందుతున్న సంకేతాలతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లు (Global Markets) పాజిటివ్‌గా ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లోనూ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ (Nifty) భారీగా లాభపడ్డాయి.

Contents
  • Stock Market Surge | భారీ లాభాలతో..
    • Stock Market Surge | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
      • Stock Market Surge | అన్ని ఇండెక్స్‌లూ గ్రీన్‌లోనే..

Stock Market Surge | భారీ లాభాలతో..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 1,134 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో స్వల్పంగా 132 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 421 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 321 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై 18 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 135 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 1,263 పాయింట్ల లాభంతో 78,111 వద్ద, నిఫ్టీ 207 పాయింట్ల లాభంతో 24,231 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Surge | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 3,585 కంపెనీలు లాభపడగా 802 స్టాక్స్ నష్టపోయాయి. 126 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 162 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 35 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Stock Market Surge | అన్ని ఇండెక్స్‌లూ గ్రీన్‌లోనే..

అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీలో పవర్ ఇండెక్స్ 2.87 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.84 శాతం, ఐటీ 2.84 శాతం, రియాలిటీ 2.56 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.54 శాతం, యుటిలిటీ 2.52 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.16 శాతం పెరిగాయి.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 28 స్టాక్స్ లాభపడగా.. 2 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఇండిగో 4.63 శాతం, ఎటర్నల్ 4.36 శాతం, పవర్‌గ్రిడ్ 4.11 శాతం, టెక్ మహీంద్రా 3.33 శాతం, టీసీఎస్ 3.31 శాతం లాభపడ్డాయి.

Losers : ఎయిర్ టెల్ 0.64 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.20 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Realme Narzo 100 Lite | బిగ్ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్

VIVO T5x 5G | భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో.. వీవో టీ5ఎక్స్ 5జీ విడుదల
Indian Stock Market Crash | పశ్చిమాసియా ఉద్రిక్తతల దెబ్బ.. మార్కెట్లలో భారీ పతనం, ఇన్వెస్టర్లకు రూ.51 లక్షల కోట్ల నష్టం
Stock Market Loss | భారీ నష్టాల్లో సూచీలు.. రూ. 9.19 లక్షల కోట్ల సంపద ఆవిరి
FIIs Stock Market Sale | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 1.22 లక్షల కోట్ల షేర్లు అమ్మేసిన ఎఫ్ఐఐలు
Stock Market Volatility | పశ్చిమాసియాలో ఆగని ఉద్రిక్తతలు.. తీవ్ర ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు
TAGGED:Domestic Stock MarketGlobal MarketsIndian economyNiftyNifty newsoil prices impactSensex Todayshare market rallystock market indiaStock Market Surgestock market updates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Unauthorized Idol Installation Unauthorized Idol Installation | అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు నిషేధం..: సీపీ సాయిచైతన్య
Next Article Farmers MSP Procurement Farmers MSP Procurement | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: మార్కెట్‌ కమిటీ వైస్ ఛైర్మన్‌
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?