Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: AE Caught by ACB | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - AE Caught by ACB | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ

తెలంగాణ

AE Caught by ACB | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ

కరీంనగర్​ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏఈ సుధాకర్ రెడ్డిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 6:30 సా.
Srinivas Kolluri
20 గంటలు ago
Share
AE Caught by ACB

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AE Caught by ACB | అవినీతి అధికారులు మారడం లేదు. తమ వద్దకు పనుల నిమిత్తం వచ్చే వారిని డబ్బుల పేరిట వేధిస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా ఓ మున్సిపల్ అసిస్టెంట్​ ఇంజినీర్ (Municiapal AE)​ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.

కరీంనగర్ (Karimnagar)​ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అడ్మినిస్ట్రేషన్​ డిపార్ట్​మెంట్​లో ఏఈగా పని చేస్తున్న నుసుమ్ సుధాకర్ రెడ్డిని వల పన్ని పట్టుకున్నారు. ఓ వ్యక్తి హుజురాబాద్​లో వర్షపు నీటి కాలువల నిర్మాణం చేపట్టాడు. సంబంధిత బిల్లుల కోసం ఏఈని కలిశారు. కాలువ పనులకు సంబంధించి కొలతలను నమోదు చేసి, తుది బిల్లును ప్రాసెస్ చేయడానికి సదరు ఏఈ రూ.50 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ (ACB) అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదిదారుడి నుంచి హుజూరాబాద్‌లోని చౌరస్తా వద్ద లంచం తీసుకుంటుండగా.. ఏఈని ఏసీబీ అధికారులు (AE Caught by ACB) రెడ్​ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

AE Caught by ACB | అవినీతి కేంద్రాలుగా..

రాష్ట్రంలో పలు మున్సిపల్​ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా బిల్లుల చెల్లింపులు, ఇంటి అనుమతుల కోసం భారీగా డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. అంతేగాకుండా మాముళ్లు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నా.. పట్టించుకోవడం లేదు. అదే డబ్బులు ఇవ్వకపోతే అన్ని ఉన్నా.. అనుమతులు ఇవ్వడం లేదు.

ఇటీవల ఏసీబీ అధికారులు పలు మున్సిపల్ కార్యాలయాపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్రమాల నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే తనిఖీల ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో అవినీతి అధికారులు భయపడటం లేదు. లంచాలు తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. ఏసీబీ కేసుల్లో దొరికిన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి: KTR comments | భూములు కబ్జా చేస్తున్న సీఎం.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

BRS Municipal Victory | క్యాతన్​పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్​ఎస్​
Kukatpally ACB Trap | ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్
Telangana Nominated Posts | త్వరలో నామినేటెడ్​​ పోస్టుల భర్తీ.. కాంగ్రెస్​ నేతల కీలక భేటీ
Musi River Buildings | మూసీలో కడుతున్న బంగ్లాలు ఎందుకు కనిపించడంలేదు.. హైడ్రాపై కవిత ఆగ్రహం..
KR Nagaraju Dance | అప్పుడు ఐపీఎస్​ అధికారిగా.. తర్వాత ఎమ్మెల్యేగా.. తాజాగా కళాకారుడిగా.. గద్దర్​ వేషధారణలో అలరించిన కేఆర్​ నాగరాజు!
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Road safety awareness | Road safety awareness | రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు : మంత్రి పొన్నం ప్రభాకర్​
Next Article TNGOs employees | TNGOs employees | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్​ కృషి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?