Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Road Safety | నగరాన్ని ప్రమాద రహితంగా మార్చాలి : సీపీ సజ్జనార్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Road Safety | నగరాన్ని ప్రమాద రహితంగా మార్చాలి : సీపీ సజ్జనార్​

హైదరాబాద్తెలంగాణ

Hyderabad Road Safety | నగరాన్ని ప్రమాద రహితంగా మార్చాలి : సీపీ సజ్జనార్​

హైదరాబాద్​​ను రోడ్డు ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దాలని సీపీ సజ్జనార్​ సూచించారు. రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 8:54 సా.
Srinivas Kolluri
19 గంటలు ago
Share
Hyderabad Road Safety

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Hyderabad Road Safety | హైదరాబాద్ (Hyderabad)​ను రోడ్డు ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దడంలో రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యుల పాత్ర అత్యంత కీలకమని సీపీ సజ్జనార్​ (CP Sajjanar) అన్నారు. రహదారి ప్రమాదంలో ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబం మొత్తం వీధిన పడుతుందని, అటువంటి విషాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

Contents
  • Hyderabad Road Safety | నో హెల్మెట్– నో ఎంట్రీ
    • Hyderabad Road Safety | సమస్యలు పరిష్కరిస్తాం

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ – అలైవ్’ (Arrive Alive )కార్యక్రమంలో బుధవారం టీజీఐసీసీసీ ఆడిటోరియంలో రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులతో హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ (Traffic Police) విభాగం అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వాహనదారులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడే భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.

Hyderabad Road Safety | నో హెల్మెట్– నో ఎంట్రీ

ఖైరతాబాద్ జోన్‌ పరిధిలోని 10 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నుంచి సుమారు 400 మంది కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీపీ మాట్లాడుతూ.. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లు తమ ప్రాంగణాల్లో ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ బోర్డులను ఏర్పాటు చేసి, కఠినంగా అమలు చేయాలని సూచించారు.

Hyderabad Road Safety | సమస్యలు పరిష్కరిస్తాం

ప్రజలు స్థానిక ట్రాఫిక్ సమస్యలను వాట్సాప్ గ్రూపుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. వాటిని ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి కేంద్ర ప్రభుత్వం ‘రహ్ వీర్’ స్కీం ద్వారా నగదు పురస్కారంతో పాటు చట్టపరమైన రక్షణ కల్పిస్తోందన్నారు. భయపడకుండా బాధితులకు సాయం చేయాలని సూచించారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడటం వంటి చర్యలు ప్రాణాంతకమని హెచ్చరించారు.

దీనిని కూడా చదవండి : Fake Goodknight Refills | హైదరాబాద్‌లో నకిలీ గుడ్‌నైట్ దందా ఖేల్ ఖతం

Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు
మేడిపల్లిలో కళ్యాణ్ జ్యువెలర్స్ భారీ షోరూమ్.. ప్రారంభించనున్న సినీ తార శ్రీలీల
Illegal Quarry | అక్రమ క్వారీలు నిర్వహిస్తున్న ‘పొంగులేటి’ : హరీశ్​రావు
Ramagundam NTPC Phase 2 | రామగుండం ఎన్టీపీసీ రెండో దశను వేగవంతం చేయాలి: కిషన్​ రెడ్డి
Babli Water Release | బాబ్లీ ప్రాజెక్ట్​ గేట్ల ఎత్తివేత
TAGGED:accident preventionCP SajjanarHyderabad traffic policeno helmet no entryRoad Safety Indiatraffic awareness
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Forest SP Harassment Forest SP Harassment | సీనియర్​ అధికారిణికి వేధింపులు.. ఫారెస్ట్​ ఎస్పీపై కేసు నమోదు
Next Article Promissory Note Promissory Note | ప్రామిసరీ నోటు రాసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే డబ్బు దక్కనట్టే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?