Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Promissory Note | ప్రామిసరీ నోటు రాసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే డబ్బు దక్కనట్టే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Promissory Note | ప్రామిసరీ నోటు రాసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే డబ్బు దక్కనట్టే!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Promissory Note | ప్రామిసరీ నోటు రాసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే డబ్బు దక్కనట్టే!

పాటించాల్సిన నిబంధనల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. హైకోర్టు న్యాయవాదుల సూచనల ప్రకారం ప్రామిసరీ నోటు విషయంలో పాటించాల్సిన కీలక సూత్రాలు ఇక్కడ ఉన్నాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 15, 2026 9:16 సా.
Naresh chandan
15 గంటలు ago
Share
Promissory Note
Promissory Note

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Promissory Note | డబ్బు లావాదేవీల విషయంలో నమ్మకం ఎంత ముఖ్యమో, చట్టబద్ధమైన జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే అవసరం. ముఖ్యంగా ప్రామిసరీ నోటు రాసే సమయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు భవిష్యత్తులో పెద్ద చిక్కులకు దారితీస్తాయి.

Contents
  • Promissory Note | స్వయంగా రాయించడం ముఖ్యం:
    • Promissory Note | అప్పు తీసుకోవడానికి కారణం ఉండాలి:
      • కాలపరిమితి, స్టాంప్ నిబంధనలు:
      • సాక్షుల సంతకాలు:
      • ఖాళీ నోటుపై సంతకం వద్దు:

అందుకే అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు పాటించాల్సిన నిబంధనల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. హైకోర్టు న్యాయవాదుల సూచనల ప్రకారం ప్రామిసరీ నోటు విషయంలో పాటించాల్సిన కీలక సూత్రాలు ఏమిటో తెలుసుకుందాం..

Promissory Note | స్వయంగా రాయించడం ముఖ్యం:

సాధారణంగా చాలామంది అప్పు తీసుకునే వ్యక్తి దగ్గర కేవలం సంతకం మాత్రమే తీసుకుంటారు. కానీ, ప్రామిసరీ నోటును అప్పు తీసుకునే వ్యక్తే తన సొంత చేతిరాతతో రాయడం అత్యంత సురక్షితం. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో తాను అప్పు తీసుకోలేదని లేదా అది తన రాత కాదని సదరు వ్యక్తి కోర్టులో వాదించే అవకాశం ఉండదు.

Promissory Note | అప్పు తీసుకోవడానికి కారణం ఉండాలి:

నోటులో అప్పును ఏ అవసరం కోసం తీసుకుంటున్నారో స్పష్టంగా రాయాలి. ఉదాహరణకు ‘పిల్లల చదువు కోసం’ లేదా ‘గృహ అవసరాల కోసం’ అని పేర్కొనాలి. దీనివల్ల ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి మరణించినా, అతని వారసులు ఆ అప్పును తీర్చడానికి చట్టపరంగా బాధ్యులవుతారు.

కాలపరిమితి, స్టాంప్ నిబంధనలు:

ప్రామిసరీ నోటు రాసిన తేదీ నుంచి దాని కాలపరిమితి కేవలం మూడేళ్లు మాత్రమే ఉంటుంది. ఈ గడువు ముగిసేలోపే అప్పును తిరిగి వసూలు చేసుకోవాలి లేదా నోటును రిన్యూవల్ చేయించుకోవాలి. అలాగే, నోటుపై రెవెన్యూ స్టాంపు అంటించి, దానిపై అప్పు తీసుకున్న వ్యక్తి అడ్డంగా సంతకం చేయాలి. స్టాంపుపై సంతకం లేకపోతే ఆ నోటుకు చట్టపరమైన గుర్తింపు ఉండదు.

సాక్షుల సంతకాలు:

డబ్బు చేతులు మారేటప్పుడు కనీసం ఇద్దరు సాక్షులు ఉండటం అవసరం. వారు నోటుపై సాక్షి సంతకాలు చేయడం వల్ల ఆ లావాదేవీకి చట్టబద్ధమైన బలం చేకూరుతుంది.

ఖాళీ నోటుపై సంతకం వద్దు:

ఎప్పుడు కూడా ఖాళీ ప్రామిసరీ నోటుపై సంతకాలు చేయకూడదు. తేదీ, అప్పుగా తీసుకున్న మొత్తం, వడ్డీ రేటు వంటి వివరాలన్నీ పూర్తిగా నింపిన తర్వాతే సంతకం పెట్టాలి. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల అప్పు ఇచ్చేవారికి భద్రత ఉండటమే కాకుండా, తీసుకునే వారు కూడా మోసపోకుండా ఉంటారు.

ఇది కూడా చదవండి: Copper Sun Vastu | రాగి సూర్యుడిని ఆ దిశలో ఉంచారా.. ఇక రాజయోగమే!

ఇది కూడా చదవండి: Temple Hair Rules | ఆ సమయంలో జుట్టు విరబోసుకోవద్దట… ఎందుకంటే!

ఇది కూడా చదవండి: Bilva Patra | బిల్వపత్రం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. త్రిమూర్తి తత్వానికి ఇది ఎలా ప్రతీకంటే!

Telangana School Hostel | హాస్టళ్లను తనిఖీ చేసిన ఎంఈవో.. కేర్​టేకర్​ను తొలగించాలని ఆదేశం..
Crude Oil Effect | క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
Tank Bund Shiva | ట్యాంక్ బండ్ ‘శివ’కు గుర్తింపు.. ప్రాణాలు కాపాడిన సేవకు ప్రభుత్వ సహాయం
Temple Pradakshina Secrets | గుడిలో ప్రదక్షిణలు చేస్తున్నారా.. అయితే ఈ రహస్యం తెలుసుకోవాల్సిందే!
Alcohol Price Hike | మద్యంప్రియులకు షాక్​.. భారీగా పెరగనున్న ధరలు
TAGGED:Promissory Note
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad Road Safety Hyderabad Road Safety | నగరాన్ని ప్రమాద రహితంగా మార్చాలి : సీపీ సజ్జనార్​
Next Article Iron Deficiency Women Iron Deficiency Women | మహిళల్లో ఐరన్ లోపం.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేశారో అంతే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?