Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Forest SP Harassment | సీనియర్​ అధికారిణికి వేధింపులు.. ఫారెస్ట్​ ఎస్పీపై కేసు నమోదు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Forest SP Harassment | సీనియర్​ అధికారిణికి వేధింపులు.. ఫారెస్ట్​ ఎస్పీపై కేసు నమోదు

క్రైంహైదరాబాద్

Forest SP Harassment | సీనియర్​ అధికారిణికి వేధింపులు.. ఫారెస్ట్​ ఎస్పీపై కేసు నమోదు

ఒక సీనియర్ టెలికాం అధికారిణిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై అటవీ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌పై నగర పోలీసులు కేసు నమోదు చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 8:34 సా.
Srinivas Kolluri
16 గంటలు ago
Share
Forest SP Harassment

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Forest SP Harassment | బంజారా హిల్స్‌ (Banjara Hills)లోని ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్‌లో తన పొరుగున నివసిస్తున్న ఒక సీనియర్ టెలికాం అధికారిణిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై అటవీ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌పై నగర పోలీసులు  (City Police)కేసు నమోదు చేశారు.

Contents
  • Forest SP Harassment | రెచ్చగొట్టే ప్రయత్నం
    • Forest SP Harassment | పోలీసుల ఎదుట సైతం..

అసభ్యకరమైన వ్యాఖ్యలు, అశ్లీల హావభావాలు, పదేపదే ప్రజలకు ఇబ్బంది కలిగించడం చేస్తున్నారని ఆయనపై ఫిర్యాదు రావడంతో చర్యలు చేపట్టారు. ఏప్రిల్ 13న సాయంత్రం ఆ మహిళ పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో పక్కింటి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయి. నిందితుడు ఎస్పీ సుతన్‌ (SP Suthan ) పదేపదే ఆమె ఇంట్లోకి వస్తూ పోతూ, గట్టిగా అరుస్తూ, తలుపులు బాదుతూ గందరగోళం సృష్టించాడని ఆరోపణలు ఉన్నాయి.

Forest SP Harassment | రెచ్చగొట్టే ప్రయత్నం

నిందితుడు తనను ఉద్దేశించి పదేపదే అనుచితమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అతను అభ్యంతరకరమైన భాషను ఉపయోగించాడని, లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని, అవమానకరమైన రీతిలో పిలుస్తూ ఆమెను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. ఆమె ఫోన్​లో రికార్డింగ్​ చేస్తున్న సదరు ఎస్పీ తన చర్యలను కొనసాగించాడు.

Forest SP Harassment | పోలీసుల ఎదుట సైతం..

సదరు ఫారెస్ట్ ఎస్పీ తీరుపై వెంటనే బాధితురాలు పోలీసులకు ఫోన్​ చేసింది. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో కూడా అతను అనుచితమైన సంజ్ఞలు చేయడం కొనసాగించాడని ఫిర్యాదుదారు ఆరోపించారు. దీంతో తదుపరి విచారణ కోసం అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సదరు మహిళ భర్త విజయవాడలో పనిచేస్తుండగా ఆమె బంజారాహిల్స్​లో ఒంటరిగా ఉంటుంది. దీంతో ఆమె తన భద్రతపై భయం, ఆందోళన వ్యక్తం చేసింది. నిందితుడిపై ఇది మొదటి ఫిర్యాదు కాదని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు చెప్పినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి : Amravati Incident | మహారాష్ట్ర అమరావతిలో సంచలనం.. బాలికలపై దారుణాలు, వందలాది వీడియోలు..

Threat Case Jail | బెదిరింపుల కేసులో ఒకరికి మూడేళ్ల జైలు..
Bamrukn Ud Daula Lake | ప్రారంభానికి బమృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్ధం
Bike Stunt Case | పోలీసుల ముందు బైక్​తో స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?
Nizamabad Police | సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ
Kakinada Fireworks Explosion | బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 20 మంది మృతి
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Women Reservation Bill Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నాం : రాహుల్ గాంధీ
Next Article Hyderabad Road Safety Hyderabad Road Safety | నగరాన్ని ప్రమాద రహితంగా మార్చాలి : సీపీ సజ్జనార్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?