అక్షరటుడే, వెబ్డెస్క్ : Parliament Special Sessions | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మూడు కీలక బిల్లులను ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం ఈ సమావేశాలు నిర్వహిస్తోంది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం (Central Government) మూడు కీలక బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026ను న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, డీలిమిటేషన్ బిల్లు 2026ను న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశ పెట్టారు.
Parliament Special Sessions | కాంగ్రెస్ వ్యతిరేకం
కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026, డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill)-2026 ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill)కు మద్దతు ఇచ్చామన్నారు. 2024 నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అలా చేయలేదన్నారు. ప్రస్తుతం 2029 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి డీలిమిటేషన్ బిల్లు తెచ్చారని విమర్శించారు.
కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ బిల్లుల సారాంశంపై మాట్లాడలేరని, బిల్లుల ప్రవేశపెట్టడానికి సంబంధించి కేవలం సాంకేతిక అభ్యంతరాలను మాత్రమే లేవనెత్తగలరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలకు తాము గట్టి సమాధానం ఇస్తామని హోం మంత్రి షా తెలిపారు.
ఇది కూడా చదవండి..: Women Reservation Bill | నేడు పార్లమెంటు ముందుకు దేశ గతినే మార్చే అత్యంత కీలక బిల్లులు!
