అక్షరటుడే, భీమ్‌గల్: Degree College Admissions | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సతీష్ గురువారం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘దోస్త్’ (DOST) నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
Degree College Admissions | కళాశాలలోని కోర్సులివే..
కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలను ప్రిన్సిపాల్ వెల్లడించారు. బీఏ (హెచ్ఈపీ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్), బీకాం (కంప్యూటర్స్), బీఎస్సీ (ఎంపీపీఎస్ అండ్ ఎంపీసీ) బీఎస్సీ (బీజెడ్సీ) గ్రూపులలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9848581970 నంబరును సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Surender Release Protest | మాజీ ఎమ్మెల్యే సురేందర్‌ను విడుదల చేయాలని రాస్తారోకో
