Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Delimitation Seats Increase | తెలంగాణలో 26, ఏపీలో 38 ఎంపీ స్థానాలు : అమిత్‌ షా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Delimitation Seats Increase | తెలంగాణలో 26, ఏపీలో 38 ఎంపీ స్థానాలు : అమిత్‌ షా

జాతీయం

Delimitation Seats Increase | తెలంగాణలో 26, ఏపీలో 38 ఎంపీ స్థానాలు : అమిత్‌ షా

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 16, 2026 6:45 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Delimitation Seats Increase

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delimitation Seats Increase | డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit shah) తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయన్నారు. తెలంగాణ (Telangana)లో ప్రస్తుతం 17 లోక్​సభ స్థానాలు ఉండగా.. 26కు పెరుగుతాయని వెల్లడించారు.

Contents
  • Delimitation Seats Increase | తప్పుడు ప్రచారం
    • Delimitation Seats Increase | చట్టంలో మార్పులు చేయలేదు

డీలిమిటేషన్​తో దక్షిణాది రాష్ట్రాల (South States)కు అన్యాయం జరుగుతుందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సభలో షా క్లారిటీ ఇచ్చారు. ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు చాలా లాభం కలుగుతుందన్నారు. ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయని, తమిళనాడులో 39 నుండి 59కి పెరగనున్నాయని ప్రకటించారు.

Delimitation Seats Increase | తప్పుడు ప్రచారం

దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని అమిత్​ షా తెలిపారు. విపక్షాలు అబద్దాలు చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. కర్ణాటకకు ప్రస్తుతం 28 స్థానాలు ఉన్నాయని, ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత 42 అవుతాయన్నారు. కేరళ 20 నుంచి 30కి చేరుతాయని వివరించారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లో, 129 మంది ఎంపీలు దక్షిణాది నుంచి ఉన్నారన్నారు. ఇది సుమారుగా 23.76 శాతానికి సమానమని తెలిపారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఎంపీల సంఖ్య 195కు చేరుతుందని, వారి ప్రాతినిధ్య బలం 23.97 శాతానికి పెరుగుతుందన్నారు.

Delimitation Seats Increase | చట్టంలో మార్పులు చేయలేదు

డీలిమిటేషన్ కమిషన్ చట్టంలో తాము ఎటువంటి మార్పులు చేయలేదని అమిత్​ షా అన్నారు. గతంలో ఇందులో ఏదో తారుమారు జరిగిందని ప్రియాంక గాంధీ అంటున్నారని, తాము మాత్రం అలా చేయమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అత్యవసర పరిస్థితిని (Emergency) విధించినప్పటికీ ప్రజల అభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించలేమన్నారు. ప్రజలకు వాస్తవం ఏమిటో బాగా తెలుసన్నారు.

దీనిని కూడా చదవండి : Women Reservation Bill | దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం : ప్రధాని మోదీ

IRCTC South India Tour | ఐఆర్​సీటీసీ సూపర్ ప్యాకేజీ.. రూ.14,500లకే దక్షిణాది యాత్ర
Asha Bhosle Death | మెలోడీ క్వీన్ ఆశా భోస్లే కన్నుమూత.. భారతీయ సంగీతానికి తీరని లోటు
Air India CEO Resignation | ఎయిరిండియా సీఈఓ రాజీనామా
India Forex Reserves | పెరిగిన ఫారెక్స్ నిల్వలు
India Gas Shortage | గ్యాస్​ కొరత అధిగమించడానికి కేంద్రం కీలక చర్యలు
TAGGED:Amit Shah statementAndhra Pradesh MPsDelimitation IndiaLok Sabha Seats IncreaseSouth India politicsTelangana MPs
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Investments Telangana Investments | తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్​ బాబు
Next Article Welfare schemes Nizamabad | Welfare schemes Nizamabad | అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?