Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rahul Gandhi | దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం : రాహుల్‌ గాంధీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Rahul Gandhi | దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం : రాహుల్‌ గాంధీ

జాతీయం

Rahul Gandhi | దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం : రాహుల్‌ గాంధీ

కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్​ బిల్లు పేరిట దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే యత్నం చేస్తుందని రాహుల్​ గాంధీ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 3:35 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Rahul Gandhi

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | కేంద్ర ప్రభుత్వం (Central Government) మహిళా రిజర్వేషన్​ బిల్లు పేరిట దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే యత్నం చేస్తుందని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Contents
  • Rahul Gandhi | మాకు ఆ సమస్య లేదు
    • Rahul Gandhi | ఓబీసీలకు అన్యాయం
      • Rahul Gandhi | బీజేపీ భయపడుతోంది

కొత్తగా మహిళా బిల్లు పెట్టాల్సిన అవసరం లేదని రాహుల్​ గాంధీ అన్నారు. 2023లోనే మహిళా బిల్లును మనం ఆమోదించినట్లు గుర్తు చేశారు. అంతగా కావాలంటే పాత మహిళా బిల్లును రద్దు చేసి.. ఇప్పుడు మళ్లీ తీసుకురండని సూచించారు. ప్రస్తుతం ప్రవేశ పెట్టిన మహిళా బిల్లుతో ఓబీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. మన జాతీయ భావనలో మహిళలు ఒక చోదక శక్తిగా ఉన్నారన్నారు.

Rahul Gandhi | మాకు ఆ సమస్య లేదు

మనమందరం మన జీవితాల్లోని మహిళల ద్వారా ప్రభావితం అయ్యాం, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, వారి నుంచి ఎంతో జ్ఞానాన్ని గ్రహించామని రాహుల్​ గాంధీ పేర్కొన్నారు. ప్రధానమంత్రికి, నాకు మాత్రం ఆ ‘భార్య’ అనే అంశం (సమస్య) లేదని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లు మహిళల కోసం ఉద్దేశించినది కాదని రాహుల్​ విమర్శించారు. దీనికి మహిళా సాధికారతతో ఎటువంటి సంబంధం లేదన్నారు.

Rahul Gandhi | ఓబీసీలకు అన్యాయం

భారతీయ సమాజం దళితులను, ఇతర వెనుకబడిన తరగతుల వారిని మరియు ఆ వర్గాలకు చెందిన మహిళలను ఏ విధంగా చూసిందనేది ఒక చారిత్రక సత్యం. కుల గణన (Caste Census) ప్రక్రియను పక్కదారి పట్టించడానికే ప్రభుత్వం ప్రస్తుతం బిల్లును తెచ్చిందన్నారు. ఓబీసీ సోదర సోదరీమణులకు అధికారాన్ని, ప్రాతినిధ్యాన్ని కల్పించకుండా తప్పించుకోవడానికి, వారి చేతుల్లో ఉన్న అధికారాన్ని లాగేసుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Rahul Gandhi | బీజేపీ భయపడుతోంది

బీజేపీ (BJP) చేస్తున్న ఈ పనికి కారణం ఏమిటంటే దేశ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూసి ఆ పార్టీ భయపడుతోందన్నారు. వారి బలం క్షీణిస్తుండటాన్ని చూసి ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అందుకే దేశ రాజకీయ చిత్రపటాన్ని పునర్వ్యవస్థీకరించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అస్సాంలోనూ, జమ్మూ కాశ్మీర్‌లోనూ ఇలాగే చేశారని చెప్పారు.బీజేపీ అధికారంలో కొనసాగడం కోసం దక్షిణ భారతం, ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని హరించి వేసే కుట్ర చేస్తోందన్నారు. దేశం ఆత్మను చంపే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Women Reservation Bill | నారీశక్తికి ముళ్లకంచే వేసిన ప్రధాని : శశిథరూర్​

Gas Cylinder Shortage | కొనసాగుతున్న గ్యాస్ క‌ష్టాలు
Maharashtra accident | వ్యాన్​ను ఢీకొన్న సిమెంట్​ మిక్సర్​ ట్రక్కు​.. 12 మంది మృతి
Petrol Gas Shortage India | దేశంలో పెట్రోల్​, గ్యాస్​ కొరత లేదు : కేంద్ర మంత్రి
Migrant Workers LPG | వలస కార్మికులకు కేంద్రం గుడ్​న్యూస్​.. 5 కేజీల సిలిండర్ల సరఫరా రెట్టింపు
Gautam Kumar Corruption Case | పోలీస్ బాస్ అవినీతి.. ఇంట్లో ప‌ని చేసే పని మనిషి కోసం ఏకంగా థార్ కారు..
TAGGED:BJPBJP criticismCaste CensusCentral GovernmentIndian PoliticsOBC concernsparliament debatepolitical updatesRahul Gandhiwomen reservation bill
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Jagruthi Posters Telangana Jagruthi Posters | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ
Next Article Grain Procurement Control Room | Grain Procurement Control Room | కొనుగోళ్ల పర్యవేక్షణకు కంట్రోల్ రూం ఏర్పాటు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?