అక్షరటుడే, వెబ్డెస్క్: KPHB Bus Fire | హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో పిల్లర్ నంబర్ 734 సమీపంలో ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడినట్లు సమాచారం.
KPHB Bus Fire | తప్పిన ప్రమాదం
ఈ ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నారు. పరిస్థితిని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు. వెంటనే బస్సును ఆపి అందరినీ సురక్షితంగా కిందికి దించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అగ్ని ప్రమాదం కారణంగా బస్సు కొంతమేర దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి..: Kondapur Drugs Bust | కొండాపూర్లో డ్రగ్స్ కలకలం
