భీమ్గల్, అక్షరటుడే: Bheemgal Reporter Fraud | పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు నుంచి తప్పిస్తామని నమ్మబలికి, బాధితుడి నుంచి రూ. లక్ష డిమాండ్ చేసిన ఓ విలేకరిపై భీమ్గల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. పురాణిపేటకు చెందిన ఓ వ్యక్తి కుమారుడిపై ఇటీవల భీమ్గల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిని ఆసరాగా చేసుకున్న సదరు విలేకరి.. కేసు నుంచి బయటపడేస్తానని బాధితుడిని నమ్మించి రూ. లక్ష డిమాండ్ చేశాడు.
Bheemgal Reporter Fraud | పరువు తీస్తానని బెదిరింపు
అందుకు బాధితుడు నిరాకరించడంతో ఆగ్రహించిన విలేకరి.. అతని దుకాణంలోకి వెళ్లి బూతు పురాణం అందుకున్నాడు. డబ్బులు ఇవ్వకుంటే పత్రికల్లో వార్తలు రాస్తానని, పరువు తీస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Bheemgal Reporter Fraud | మోసగాళ్లను నమ్మొద్దు : సీఐ
పోలీస్ స్టేషన్ పనుల కోసం మధ్యవర్తులను, దళారులను సంప్రదించవద్దని భీమ్గల్ సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్ సూచించారు. కేసుల నుంచి తప్పిస్తామని పోలీసుల పేరిట ఎవరైనా విలేకరులు, ఇతరులు డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా తమకు సమాచారం అందించాలన్నారు. పోలీస్ సేవలకు ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Kondapur Drugs Bust | కొండాపూర్లో డ్రగ్స్ కలకలం
