అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Child Murder | పెద్దల వివాహేతర సంబంధాలు పిల్లలను బలి తీసుకుంటున్నాయి. తల్లిదండ్రుల క్షణిక సుఖం, చిన్నారులను బలిపీఠం ఎక్కిస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమాయక బాలుడిపై జరిగిన క్రూర హత్య స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఐదేళ్ల చిన్నారుడు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.
Kamareddy Child Murder | సన్నిహిత సంబంధం..
పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన లక్ష్మీకి వివాహం కాగా.. ఆమెకు ఐదేళ్ల శ్రావణ్, ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారు. కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె భర్తకు దూరంగా ఉంటూ, పిల్లలతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గత ఆరు నెలలుగా లక్ష్మీనర్సింలు అనే వ్యక్తితో ఆమెకు సన్నిహిత సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం.
Kamareddy Child Murder | అతి క్రూరంగా హింసించి…
కాగా, శుక్రవారం లక్ష్మీ పని మీద బయటికి వెళ్లిన సమయంలో, ఇంట్లో ఉన్న చిన్నారి శ్రావణ్‌పై నిందితుడు నర్సింలు అమానుషంగా దాడి చేశాడు. గొంతు పిసికి, నోరు–ముక్కు మూసి, నేలకేసి కొట్టి, కళ్లలో కారంపొడి పోసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి ఎలాంటి ప్రతిఘటన చేయలేని పరిస్థితిలోనూ ఇలా క్రూరంగా హింసించి చంపడం నిందితుడి రాక్షతత్వానికి పరాకాష్ట.
రాజంపేట గ్రామానికి చెందిన లక్ష్మీ బంధువు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన చిన్నారుల భద్రత, కుటుంబ పరిసరాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.
ఇది కూడా చదవండి..: Kondapur Drugs Bust | కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం
