Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Strait of Hormuz Tensions | హ‌ర్మూజ్‌లో నౌక‌ల రాకపోక‌ల‌కు అనుమ‌తి.. యూఎస్ దిగ్బంధనం కొనసాగిస్తే మళ్లీ మూసేస్తామన్న ఇరాన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Strait of Hormuz Tensions | హ‌ర్మూజ్‌లో నౌక‌ల రాకపోక‌ల‌కు అనుమ‌తి.. యూఎస్ దిగ్బంధనం కొనసాగిస్తే మళ్లీ మూసేస్తామన్న ఇరాన్

అంతర్జాతీయం

Strait of Hormuz Tensions | హ‌ర్మూజ్‌లో నౌక‌ల రాకపోక‌ల‌కు అనుమ‌తి.. యూఎస్ దిగ్బంధనం కొనసాగిస్తే మళ్లీ మూసేస్తామన్న ఇరాన్

హ‌ర్మూజ్‌ జలసంధిని మళ్లీ మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 18, 2026 10:10 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Strait of Hormuz Tensions

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Strait of Hormuz Tensions | పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు మరోసారి తీవ్రమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గమైన హ‌ర్మూజ్‌ జలసంధిపై ఇరాన్ మరోసారి కఠిన వైఖరి అవలంభించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగితే ఈ సముద్ర మార్గాన్ని మళ్లీ మూసివేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ శనివారం హెచ్చరించారు.

Contents
  • Strait of Hormuz Tensions | చ‌మురు ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం..
    • Strait of Hormuz Tensions | జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సోషల్ మీడియాలో చేసిన ప్రకటనలపై గాలిబాఫ్ ఘాటుగా స్పందించారు. “ట్రంప్ ఒక గంటలోనే ఏడు అబద్ధాలు చెప్పారు. యుద్ధంలో గెలవలేని వారు చర్చల ద్వారా ఏమీ సాధించలేరు” అని విమర్శించారు. హ‌ర్మూజ్‌ జలసంధిని తెరవాలా, మూసివేయాలా అన్నది సోషల్ మీడియా (Social Media) పోస్టులు నిర్ణయించవని, అది తమ సైనిక దళాల ఆధీనంలో ఉంటుందని స్పష్టం చేశారు.

Strait of Hormuz Tensions | చ‌మురు ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం..

ఇకపై ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు తప్పనిసరిగా ఇరాన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, తాము సూచించే మార్గాల ద్వారానే ప్రయాణం సాగించాలని గాలిబాఫ్ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఆందోళన నెలకొంది. ఇది జరుగుతుండగానే, కొద్ది రోజుల క్రితం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Minister Abbas Araqchi) కాల్పుల విరమణ నేపథ్యంలో హ‌ర్మూజ్‌ జలసంధిని వాణిజ్య నౌకలకు తిరిగి తెరిచినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన ట్రంప్, ఇరాన్ ఇకపై ఈ మార్గాన్ని మూసివేయబోదని పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేయడం టెహ్రాన్‌కు ఆగ్రహం తెప్పించింది.

Strait of Hormuz Tensions | జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడం

ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ మళ్లీ కఠిన వైఖరిని అవలంబిస్తూ, దిగ్బంధనం కొనసాగితే జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ హ‌ర్మూజ్‌ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ఒకవేళ ఈ మార్గం మూసివేస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇక అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా జరిగిన తొలి విడత చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతో రెండో విడత చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Pakistan Army Chief Asim Munir) మధ్యవర్తిత్వం వహిస్తూ టెహ్రాన్‌ను సందర్శించి చర్చలకు మార్గం సుగమం చేయాలని ప్రయత్నించారు. అయితే చర్చలు ముందుకు సాగుతున్న తరుణంలోనే హ‌ర్మూజ్‌ జలసంధి అంశంపై మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

ఇది కూడా చదవండి..: Hormuz Strait Reopens | ఇరాన్​ గుడ్​న్యూస్​.. తెరుచుకున్న హర్ముజ్​ జలసంధి

Israel Iran Attacks | ఇరాన్​ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడులు
IRGC Intelligence Chief | ఇరాన్​కు షాక్​.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మృతి
Amy Jones Pippa Cleary Marriage  | ఎల్ల‌లు దాటిన ప్రేమ‌.. అందరి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఇంగ్లండ్-ఆస్ట్రేలియా క్రికెటర్ల ప్రేమ పెళ్లి
Iran Acting Supreme Leader | ఇరాన్​ తాత్కాలిక సుప్రీం లీడర్​గా ఆయతుల్లా అరాఫీ
Qatar Iran Missile | ఖతార్​పై ఇరాన్​ క్షిపణి దాడి.. భయంతో ప్రజల పరుగులు
TAGGED:Donald TrumpIslamabadMinister Abbas AraqchiPakistan Army Chief Asim MunirSocial MediaStrait of Hormuz Tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article KKR Playoff Chances KKR Playoff Chances | దారుణంగా నిరాశ‌ప‌రుస్తున్న కేకేఆర్.. ఇక ప్లే ఆఫ్ ఆశ‌లు వదులుకున్న‌ట్టేనా ?
Next Article Afghanistan Earthquake Afghanistan Earthquake | ఆఫ్ఘానిస్తాన్‌లో భూకంపం.. కాశ్మీర్‌లోనూ ప్ర‌కంప‌న‌లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?