అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Premier League Rally | జిల్లా కేంద్రంలో ప్రీమియర్ లీగ్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ప్రతినిధులు, పోలీసు సిబ్బంది, ఆయా కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఉదయం డీఎస్ఏ మైదానం నుంచి పాలిటెక్నిక్ గ్రౌండ్ (Polytechnic Ground) వరకు సాగింది.
Premier League Rally | ప్రీమియర్ లీగ్ నిర్వహణ అభినందనీయం
డీఎస్ఏ గ్రౌండ్లో ప్రీమియర్ లీగ్ ర్యాలీని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ నిర్వహించనుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎంతోమంది క్రీడాకారులను దేశానికి అందించినటువంటి ఘనత నిజామాబాద్ జిల్లాకు ఉందన్నారు. ఈ ప్రీమియర్ లీగ్‌లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, యోగా లాంటి క్రీడలు నిర్వహిస్తున్నారని, ఇందులో అన్ని మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు.

Premier League Rally | యువతను సన్మార్గంలో నడిపించేందుకే..
ఈ క్రీడల్లో గెలుపొందినటువంటి వారికి ప్రైజ్ మనీ కూడా డిక్లేర్ చేయడం జరిగిందని సీపీ అన్నారు. యువతను సన్మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో యువతను ప్రోత్సహించేందుకు ఈ లీగ్ నిర్వహిస్తన్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 200 మంది చనిపోయారని, కాని రోడ్డు ప్రమాదాల వల్ల జిల్లాలో 2025లో 300 మంది మరణించారన్నారు. రోడ్డు ప్రమాదాలు (Road Accidents) ఎక్కువగా నిర్లక్ష్యమైన డ్రైవింగ్‌తోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్సీ ఛైర్మన్ సాయి చైతన్య, కన్వీనర్ బస్వారెడ్డి, జనరల్ సెక్రెటరీ కవితా రెడ్డి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్ (ఫిజికల్ సెక్యూరిటీ), డాక్టర్ శిరీష్ కుమార్ (సైబర్ సెక్యూరిటీ), పితానీ, శివప్రసాద్, గణేష్ గుప్తా, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Road Accident Awareness | బ్లాక్‌స్పాట్ వద్ద అజాగ్రత్తతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు..
