Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: MPTC ZPTC Elections | త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - MPTC ZPTC Elections | త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

తెలంగాణతాజా వార్తలు

MPTC ZPTC Elections | త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 18, 2026 5:21 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
MPTC ZPTC Elections

అక్షరటుడే, వెబ్​డెస్క్: MPTC ZPTC Elections | రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

Contents
  • MPTC ZPTC Elections | మేలో ఎన్నికలు
    • MPTC ZPTC Elections | 566 జడ్పీటీసీలు, 5,773 ఎంపీటీసీలు

రాష్ట్ర ప్రభుత్వం (State Government) పంచాయతీ ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ కూడా విడుదల చేసింది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశంతో ఆ ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) అటు తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించింది. దీంతో ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది.

MPTC ZPTC Elections | మేలో ఎన్నికలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ అమలు చేస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చింది. ఈ మేరకు బిల్లులు అసెంబ్లీలో ఆమోదించినా కేంద్రం వద్ద పెండింగ్​లో ఉన్నాయి. అనంతరం తెచ్చిన ఆర్డినెన్స్​ను కోర్టు కొట్టేసింది. దీంతో కోర్టు తీర్పు వచ్చాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతామని గతంలో ప్రకటించింది. అయితే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో (municipal elections) బీసీ రిజర్వేషన్ల అంశం పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో అధికార కాంగ్రెస్​ పార్టీ అదే ఊపులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మేలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

MPTC ZPTC Elections | 566 జడ్పీటీసీలు, 5,773 ఎంపీటీసీలు

గతంలో రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ (Election Commission Notification) విడుదల చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్​తో అప్పుడు షెడ్యూల్​ వెలువడింది. నామినేషన్లు సైతం స్వీకరించారు. అయితే బీసీ రిజర్వేషన్లను కోర్టు కొట్టేయడంతో నోటిఫికేషన్​ను ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో మళ్లీ షెడ్యూల్​ విడుదల చేయనుంది. అయితే గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ప్రకటించిన రిజర్వేషన్లు మారనున్నాయి. అప్పుడు 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఆయా స్థానాలను ఖరారు చేశారు. ప్రస్తుతం పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా రాష్ట్రంలో మొత్తం 566, 5,773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇది కూడా చదవండి..: KTR Jagtial Speech | గుంట నక్కల్లో దడ మొదలైంది : కేటీఆర్​

Heatwave Alert | మరింత పెరగనున్న ఎండలు.. వడగాలులతో జాగ్రత్త
April 11 Horoscope | అమ్మ వైపు బంధువుల ద్వారా కనక వర్షం.. తలుపు తట్టనున్న లక్ష్మీదేవి!
Moinabad Drugs Case | డ్రగ్స్​ కేసులో కీలక పరిణామం.. పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ సీజ్
Basara temple development | ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్​.. బాసరలో 9 అంత‌స్తులతో రాజ‌గోపురం
March 26 Horoscope | ఊహించని ధనం చేతికి.. ఆఫీసులో ఉద్యోగులకు సానుకూలం.. ఈ రాశుల వారికి నేడు అన్ని శుభాలే!
TAGGED:bc reservation issueindia political newslocal body elections indiaMPTC ZPTC ElectionsMunicipal Electionspanchayat elections newsrural elections indiastate election updateState Governmentzptc mptc polls
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Women Rights Protest Women Rights Protest | మహిళా హక్కులను కాంగ్రెస్​ కాలరాస్తోంది..
Next Article Road Accidents Awareness | Road Accidents Awareness | రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలి: సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?