Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kalyana Lakshmi Scheme | పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కాంగ్రెస్​ భరోసా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kalyana Lakshmi Scheme | పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కాంగ్రెస్​ భరోసా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ

నిజామాబాద్

Kalyana Lakshmi Scheme | పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కాంగ్రెస్​ భరోసా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఎల్లప్పుడూ కాంగ్రెస్​ భరోసాగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ అన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 591మంది లబ్ధిదారురులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 13, 2026 3:39 సా.
Shashi kiran Mottala
3 రోజులు ago
Share
Kalyana Lakshmi Scheme |
Kalyana Lakshmi Scheme | పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కాంగ్రెస్​ భరోసా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ

​అక్షరటుడే, ఇందూరు: Kalyana Lakshmi Scheme | పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఎల్లప్పుడూ కాంగ్రెస్​ భరోసాగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ అన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 591 మంది లబ్ధిదారురులకు రూ. 5.92 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi scheme), షాదీ ముబారక్ (Shaadi Mubarak) చెక్కులను ఆయన అందజేశారు.

Contents
  • Kalyana Lakshmi Scheme | ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమమే ముఖ్యం..
    • Kalyana Lakshmi Scheme | ప్రజా పాలనలో అప్రతిహతంగా అభివృద్ధి పథకాలు
      • సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Kalyana Lakshmi Scheme | ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమమే ముఖ్యం..

చెక్కుల పంపిణీ సందర్భంగా షబ్బీర్​ అలీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా ముందుకు వెళ్తోందన్నారు. రాష్ట్రం అప్పుల కష్టాల్లో ఉన్నప్పటికీ, పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ​404 మంది మైనారిటీలకు షాదీ ముబారక్​ కింద, 187మంది లబ్ధిదారులకు ​కల్యాణ లక్ష్మి కింద చెక్కులు అందజేశారు.

Kalyana Lakshmi Scheme | ప్రజా పాలనలో అప్రతిహతంగా అభివృద్ధి పథకాలు

అనంతరం పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్ (PCC Chief Bomma)​ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే కీలకమైన హామీలను నెరవేర్చిందని గుర్తు చేశారు. ​కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వీటికి తోడు ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses), రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాల కల్పన, సన్నబియ్యం పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ, గడుగు గంగాధర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు, బొబ్బిలి రామకృష్ణ, మేయర్ ఉమారాణి, నుడా ఛైర్మన్​ కేశ వేణు, స్థానిక కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

నగరంలోని గెస్ట్​హౌస్​లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ, పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​గౌడ్​ ఆధ్వర్యంలో సీఎంఆర్​ఎఫ్ (CMRF)​ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యం, ప్రమాదాలు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. నగరంలోని 54మంది లబ్ధిదారులకు రూ.32 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. పీసీసీ చీఫ్​ మాట్లాడుతూ.. అనారోగ్యం పాలై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి పేదవాడిని ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

ఇది కూడా చదవండి: SSC Exam Centers | పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Kendriya Vidyalaya Sections | కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు.. ఫలించిన ఎంపీ అర్వింద్​ కృషి..
Ambedkar Jayanti Nizamabad | రాజ్యాంగం స్ఫూర్తితోనే అందరికీ అభివృద్ధి ఫలాలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
BJP Dinesh Kulachari | మాట ఇచ్చి నిలబెట్టుకోవడం బీజేపీ నైజం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Road Accident | జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఒకరి మృతి
Fake Land Documents | ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాకు యత్నం.. ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు
TAGGED:CMRFCongress welfarefinancial aid bridesgovernment schemes indiaIndiramma HousesNizamabad NewsPCC Chief Bomma Mahesh Kumar GoudShaadi Mubaraktelangana schemesWelfare Programs
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article CCS Police CCS Police | పేకాట స్థావరంపై సీసీఎస్​ పోలీసుల మెరుపుదాడి.. ప్రముఖులు ఉన్నట్లుగా అనుమానాలు..
Next Article Iran US Tensions Iran US Tensions | గల్ఫ్​ దేశాల్లోని పోర్టులను మూసేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?