అక్షరటుడే, వెబ్‌డెస్క్: Promissory Note | డబ్బు లావాదేవీల విషయంలో నమ్మకం ఎంత ముఖ్యమో, చట్టబద్ధమైన జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే అవసరం. ముఖ్యంగా ప్రామిసరీ నోటు రాసే సమయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు భవిష్యత్తులో పెద్ద చిక్కులకు దారితీస్తాయి.
అందుకే అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు పాటించాల్సిన నిబంధనల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. హైకోర్టు న్యాయవాదుల సూచనల ప్రకారం ప్రామిసరీ నోటు విషయంలో పాటించాల్సిన కీలక సూత్రాలు ఏమిటో తెలుసుకుందాం..
Promissory Note | స్వయంగా రాయించడం ముఖ్యం:
సాధారణంగా చాలామంది అప్పు తీసుకునే వ్యక్తి దగ్గర కేవలం సంతకం మాత్రమే తీసుకుంటారు. కానీ, ప్రామిసరీ నోటును అప్పు తీసుకునే వ్యక్తే తన సొంత చేతిరాతతో రాయడం అత్యంత సురక్షితం. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో తాను అప్పు తీసుకోలేదని లేదా అది తన రాత కాదని సదరు వ్యక్తి కోర్టులో వాదించే అవకాశం ఉండదు.
Promissory Note | అప్పు తీసుకోవడానికి కారణం ఉండాలి:
నోటులో అప్పును ఏ అవసరం కోసం తీసుకుంటున్నారో స్పష్టంగా రాయాలి. ఉదాహరణకు ‘పిల్లల చదువు కోసం’ లేదా ‘గృహ అవసరాల కోసం’ అని పేర్కొనాలి. దీనివల్ల ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి మరణించినా, అతని వారసులు ఆ అప్పును తీర్చడానికి చట్టపరంగా బాధ్యులవుతారు.
కాలపరిమితి, స్టాంప్ నిబంధనలు:
ప్రామిసరీ నోటు రాసిన తేదీ నుంచి దాని కాలపరిమితి కేవలం మూడేళ్లు మాత్రమే ఉంటుంది. ఈ గడువు ముగిసేలోపే అప్పును తిరిగి వసూలు చేసుకోవాలి లేదా నోటును రిన్యూవల్ చేయించుకోవాలి. అలాగే, నోటుపై రెవెన్యూ స్టాంపు అంటించి, దానిపై అప్పు తీసుకున్న వ్యక్తి అడ్డంగా సంతకం చేయాలి. స్టాంపుపై సంతకం లేకపోతే ఆ నోటుకు చట్టపరమైన గుర్తింపు ఉండదు.
సాక్షుల సంతకాలు:
డబ్బు చేతులు మారేటప్పుడు కనీసం ఇద్దరు సాక్షులు ఉండటం అవసరం. వారు నోటుపై సాక్షి సంతకాలు చేయడం వల్ల ఆ లావాదేవీకి చట్టబద్ధమైన బలం చేకూరుతుంది.
ఖాళీ నోటుపై సంతకం వద్దు:
ఎప్పుడు కూడా ఖాళీ ప్రామిసరీ నోటుపై సంతకాలు చేయకూడదు. తేదీ, అప్పుగా తీసుకున్న మొత్తం, వడ్డీ రేటు వంటి వివరాలన్నీ పూర్తిగా నింపిన తర్వాతే సంతకం పెట్టాలి. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల అప్పు ఇచ్చేవారికి భద్రత ఉండటమే కాకుండా, తీసుకునే వారు కూడా మోసపోకుండా ఉంటారు.
ఇది కూడా చదవండి: Copper Sun Vastu | రాగి సూర్యుడిని ఆ దిశలో ఉంచారా.. ఇక రాజయోగమే!
ఇది కూడా చదవండి: Temple Hair Rules | ఆ సమయంలో జుట్టు విరబోసుకోవద్దట… ఎందుకంటే!
ఇది కూడా చదవండి: Bilva Patra | బిల్వపత్రం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. త్రిమూర్తి తత్వానికి ఇది ఎలా ప్రతీకంటే!
