అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై నమోదైన బ్రిటిష్ పౌరసత్వ కేసుపై విచారణ జరపాలని లక్నో హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుదారుడు పిటిషన్‌పై ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Rahul Gandhi | రాయ్‌బరేలీ పోలీస్ స్టేషన్‌కు ఆదేశం
రాయ్‌బరేలీ లోక్‌సభ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లక్నో హైకోర్టు రాయ్‌బరేలీ జిల్లా కోత్వాలి పోలీస్ స్టేషన్‌ను ఆదేశించింది. గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే తన అభ్యర్థనను లక్నోలోని ప్రత్యేక కోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతో బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ హైకోర్టులో సవాల్ చేశారు. గాంధీ బ్రిటిష్ జాతీయుడు కూడా అని సూచించే పత్రాలు, ఆధారాలు వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
హైకోర్టు తీర్పుపై స్పందించిన పిటిషనర్
హైకోర్టు తీర్పుపై పిటిషనల్ స్పందించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ.. చారిత్రాత్మకమైన తీర్పుగా అభివర్ణించారు. “జాతీయ భద్రత, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిజాన్ని వెలుగులోకి తెచ్చినందుకు, గౌరవనీయమైన కోర్టుకు నా చివరి శ్వాస వరకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి..: Rahul Gandhi | దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం : రాహుల్ గాంధీ
