అక్షరటుడే, వెబ్డెస్క్ : Women Reservation Bill | మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు విపక్షాలు వ్యతిరేకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ అనంతరం ఆయన సమాధానం ఇచ్చారు.
లోక్‌సభ (Lok Sabha)లో అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులపై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు. మహిళా బిల్లును ఎవరూ వ్యతిరేకించలేదని తెలిపారు. ఇండి కూటమి సభ్యులు బిల్లుకు మద్దతిస్తామని చెబుతూనే.. కానీ.. అయితే అంటూ వ్యతిరేకించారని విమర్శించారు. విపక్షాలది మహిళా వ్యతిరేక మైండ్ సెట్ ఆరోపించారు.
Women Reservation Bill | వచ్చే ఎన్నికల్లో..
డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్న వారు వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ సీట్ల పెరుగుదలను వ్యతిరేకిస్తున్నారని షా అన్నారు. మహిళలకు మేలు చేసే బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. మహిళా సాధికారత కోసం చేసే పనులకు ఎందుకు మద్దతివ్వడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేసేలా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు.
Women Reservation Bill | తీవ్ర వ్యత్యాసం
ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల జనాభాలో తీవ్ర వ్యత్యాసం ఉందని అమిత్ షా అన్నారు. మల్కాజ్గిరి (Malkajgiri) వంటి చోట్ల 30 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని చెప్పారు. అంతమందికి ఒక ఎంపీ ఎలా సరిపోతారని ప్రశ్నించారు. కొన్ని నియోజకవర్గాల్లో 60 వేల ఓటర్లు మాత్రమే ఉన్నారన్నారు. ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి తమ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభన చేయాలని బిల్లు తెచ్చినట్లు తెలిపారు. ఈ ముఖ్యమైన రాజ్యాంగ సవరణ బిల్లుపై సభలో దాదాపు 133 మంది సభ్యులు మాట్లాడారని, వీరిలో 56 మంది మహిళలు ఉన్నట్లు అమిత్ షా తెలిపారు.
ఇది కూడా చదవండి : Rahul Gandhi | దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం : రాహుల్ గాంధీ
