అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delimitation Bill | రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ (Delimitation) బిల్లులను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
బిల్లులపై చర్చ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం అయింది. డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ బిల్లును కలపకూడదని, డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రాలకు పెరిగే సీట్ల సంఖ్యను బిల్లులో పొందుపర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రెండో డిమాండ్‌కు అమిత్ షా అంగీకరించారు. బిల్లులో మార్పులు చేసి సభలో పెట్టారు.
Delimitation Bill | 298 ఓట్లు
లోక్‌సభ మూడు బిల్లులపై ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించింది. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026 మరియు డీలిమిటేషన్ బిల్లు, 2026పై ఓటింగ్ నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్ నిర్వహించారు. ఎన్డీఏ బలం 293 సభ్యులు ఉండగా.. ఇండి కూటమికి 233, ఇతరులు 15 మంది ఉన్నారు. బిల్లుల ఆమోదానికి 360 ఓట్లు అవసరం ఉండగా.. అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. మొత్తం528 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలైన ఓట్లలో మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో బిల్లు వీగిపోయింది. బిల్లు పాస్ కావాలంటే 352 ఓట్లు రావాల్సి ఉంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుతో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీ లిమిటేషన్ లింక్ అయి ఉన్నాయి. దీంతో ఆ బిల్లులపై ఓటింగ్‌కు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజ్ తెలిపారు. అనంతరం స్పీకర్ లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు.
దీనిని కూడా చదవండి : Women Reservation Bill | వాళ్లు ‘మహిళా బిల్లు’కు వ్యతిరేకం.. విపక్షాలపై అమిత్ షా ఫైర్
