Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BJP Jagtial | పార్టీ ఫండ్​ నొక్కేసిన బీజేపీ ఇన్​ఛార్జి.. కౌన్సిలర్​ అభ్యర్థుల ఆందోళన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - BJP Jagtial | పార్టీ ఫండ్​ నొక్కేసిన బీజేపీ ఇన్​ఛార్జి.. కౌన్సిలర్​ అభ్యర్థుల ఆందోళన

తెలంగాణతాజా వార్తలు

BJP Jagtial | పార్టీ ఫండ్​ నొక్కేసిన బీజేపీ ఇన్​ఛార్జి.. కౌన్సిలర్​ అభ్యర్థుల ఆందోళన

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఫండ్​ను ఇన్​ఛార్జి భోగ శ్రావణి నొక్కేశారని బీజేపీ కౌన్సిలర్​ అభ్యర్థులు ఆరోపించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 18, 2026 2:45 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
BJP Jagtial

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP Jagtial | మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఫండ్​ను ఇన్​ఛార్జి భోగ శ్రావణి (Bhoga Sravani) నొక్కేశారని కౌన్సిలర్​ అభ్యర్థులు ఆరోపించారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరిగిన విషయం తెలిసిందే. అధికార కాంగ్రెస్​ పార్టీ (Congress Party) మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. పలు చోట్ల బీఆర్​ఎస్​ సైతం గట్టి పోటీ ఇచ్చింది. జగిత్యాల మున్సిపల్​ ఎన్నికలను కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కువ సీట్లు గెలవాలని ఎంపీ అర్వింద్ (MP Arvind) ప్రయత్నించారు. అయితే అక్కడ అధికార కాంగ్రెస్​ మున్సిపల్​ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికలు ముగిసి రెండు నెలలు అవుతోంది. ఈ క్రమంలో తాజాగా జగిత్యాల బీజేపీ ఇన్​ఛార్జి భోగ శ్రావణిపై కౌన్సిలర్​ అభ్యర్థులు ఆరోపణలు చేయడం గమనార్హం.

BJP Jagtial | పార్టీ ఆఫీస్​లో ఆందోళన

మున్సిపల్​ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ (BJP) అభ్యర్థులు శనివారం పార్టీ ఆఫీసులో ఆందోళన చేపట్టారు. పార్టీ ఫండ్​ విషయంలో భోగ శ్రావణి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. 50 వార్డులకు గాను 46 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే.. ఒక్కొక్కరికి రూ.2,15,000 రావాల్సి ఉండగా మొత్తం ఇవ్వలేదన్నారు. కొందరికి రూ.50 వేలు, మరికొందరికి రూ.లక్ష మాత్రమే భోగ శ్రావణి ఇచ్చారని, మిగతావి ఆమె నొక్కేశారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే కౌన్సిలర్​గా పోటీ చేసిన అభ్యర్థులు రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో నిజ నిర్ధారణ కమిటీ జగిత్యాలలో విచారణ చేపట్టింది.భోగ శ్రావని ప్రచారానికి కూడా సహకారం అందించలేదని అభ్యర్థుల విమర్శించారు. పూర్తి నిధుల వివరాలు బయట పెట్టి.. శ్రావణిపై కఠినమైన చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి..: Ramchander Rao House Arrest | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్

Revanth Reddy | డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Gadwal Fire Accident | జోగులాంబ గద్వాలలో భారీ అగ్నిప్రమాదం.. పెయింటింగ్ షాపు దగ్ధం, రూ.35 లక్షల నష్టం
Tata Motors March Offers | ‘టాటా మోటార్స్ మార్చి ఆఫర్స్.. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా..
Illegal Quarry | అక్రమ క్వారీలు నిర్వహిస్తున్న ‘పొంగులేటి’ : హరీశ్​రావు
Nizamabad Murder Case | గొడ్డలితో మెడపై నరికి.. నిజామాబాద్​లో యువకుడి దారుణ హత్య!
TAGGED:bjp candidates protestbjp fund allegationsBJP Jagtialcouncillor protestelection fund issueindia political newsmunicipal election controversyparty fund misuse
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article DA Hike  DA Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
Next Article GHMC Encroachment Drive GHMC Encroachment Drive | ఫుట్​పాత్​ ఆక్రమణలపై జీహెచ్​ఎంసీ ఉక్కుపాదం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?