అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Jagtial Speech | మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు శనివారం జగిత్యాలలో పర్యటించారు. ఈ నెల 20న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి (Former Minister Jeevan Reddy) బీఆర్ఎస్లో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగిత్యాలలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నారు. దీనికి కేసీఆర్ సైతం హాజరు కానున్నారు.
కేటీఆర్, హరీశ్‌రావు శనివారం హైదరాబాద్ నుంచి ఒకే కారులో జగిత్యాలకు వచ్చారు. కేసీఆర్ (KCR) సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సింహం బయటికి వస్తుందంటే గుంట నక్కల గుండెల్లో దడ పుడుతుందన్నారు. కేసీఆర్ జగిత్యాలలో సభ పెడతానంటే ఆ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
KTR Jagtial Speech | చిల్లర ముఖ్యమంత్రి
మేడిగడ్డ పోయేందుకు రెండేళ్లుగా రేవంత్ రెడ్డికి సమయం లేదు కానీ కేసీఆర్ సభ పెట్టిన రోజే వెళ్తున్నారన్నారు. జగిత్యాలకు వచ్చే రోడ్డు మూడేళ్లలో గుర్తులేదు కానీ ఈరోజే తవ్విస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైట్ ఒకటే అనుకున్నా మెదడు కూడా చిన్నదే అని ఎద్దేవా చేశారు. ఇంత చిల్లర ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో తన పర్యటనలో గాయపడిన జర్నలిస్టు మిత్రుడికి నయం అయ్యేవరకు అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
KTR Jagtial Speech | మౌనంగా కూర్చున్నారు
లోక్‌సభ సమావేశాల్లో బీఆర్ఎస్ (BRS) ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే.. తెలంగాణ ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ.. మాట్లాడిన తేజస్వికి తెలంగాణ బిడ్డల తరఫున దీటైన సమాధానం చెప్పేవాళ్లమన్నారు. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా మౌనంగా కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి తేజస్వి సూర్యను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.
KTR Jagtial Speech | కేంద్ర మంత్రి ఇంటికి సీఎం
మహిళా బిల్లుకు కాంగ్రెస్ (Congress) మద్దతు ఇవ్వలేదని హరీశ్‌రావు అన్నారు. దీంతో కాంగ్రెస్ నాయకుల ఇళ్లు ముట్టడించండని బీజేపీ వాళ్ళు పిలుపునిచ్చారని.. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్ చేయడానికి పోయారని తెలిపారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ ఖండించలేదన్నారు. అసలు బీజేపీ నేతలతో రేవంత్ రెడ్డి రిలేషన్ ఏమిటని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి..: GHMC Encroachment Drive | ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం
