అక్షరటుడే, బాన్సువాడ: Secretariat Protest | మలిదశ ఉద్యమకారులు తమ సమస్యలను వెల్లడించేందుకు సెక్రెటేరియట్‌కు శనివారం ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Secretariat Protest | హామీలు ఇచ్చి 28 నెలలు గడిచినా..
ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీలు 28 నెలలు గడిచినా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలను వ్యక్తపర్చడానికి సచివాలయానికి వస్తే పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తరలించారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లో కూడా తగిన సౌకర్యాలు కల్పించలేదని, తాగునీటి కోసం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నామని వారు పేర్కొన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ.. ఇదేనా ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం.. అంటూ పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు.
Secretariat Protest | జూన్ 2లోపు స్పష్టమైన హామీ ఇవ్వాలి..
ప్రభుత్వం తమ హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జూన్ 2వ తేదీ లోపు స్పష్టమైన ప్రకటన చేయకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి (Kamareddy) జిల్లా ఉద్యమకారుల అధ్యక్షుడు ఉడుత గంగాధర్ గుప్తా, బాన్సువాడ మండల అధ్యక్షుడు గంజి చందు, జిల్లా మీడియా కన్వీనర్ దండు విజయ్ కుమార్, ఎద్దుబల్లి కృష్ణ, కాల్వ శ్యామ్, భాస్కర్ గౌడ్, గంగారం, బిచ్కుంద గంగారం తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Women Rights Protest | మహిళా హక్కులను కాంగ్రెస్ కాలరాస్తోంది..
