అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Nizamabad Premier League | నిజామాబాద్ ప్రీమియర్ లీగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పోటీల్లో పాల్గొనే జట్లకు (Nizamabad cricket) సంబంధించి శనివారం సాయంత్రం సీపీ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(Nizamabad Police Commissionerate), నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(Nizamabad Security Council) ఆధ్వర్యంలో డ్రా తీశారు. నిజామాబాద్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనేందుకు 32 టీంలు దరఖాస్తు చేసుకొన్నాయి. ఈ టీంలను ఏ, బీ గ్రూప్‌లుగా విభజించారు.
Nizamabad Premier League | 32 టీంలు దరఖాస్తు.. రెండు గ్రూప్‌లుగా విభజించి..
గ్రూప్ ‘ఏ’లో.. నందిపేట్, విక్కీ ఎలెవన్, శివాజీ ఛత్రపతి, అహ్మద్ పూర్, స్కేల్పేట్ స్ట్రికర్స్, రుద్రూర్, నవీపేట్, రూరల్, గరుడ బ్లాస్టర్స్, దుబాయ్ పెర్ఫ్యూమ్స్, సందీప్, వాల్వై 11 స్టార్స్, 7వ బెటాలియన్, మోర్తాడ్ 11, వర్ని వారియర్స్, మోహన్ 11 జట్లు ఉన్నాయి.
Nizamabad Premier League | ‘బీ’ గ్రూప్‌లో..
గ్రూప్ ‘బీ’లో ముప్కాల్, వేల్పూర్, కమ్మర్పల్లి పీఎస్, నిజామాబాద్ మ్యాన్ పవర్, టౌన్–1 పీఎస్, కొండాపూర్, రైసింగ్ స్టార్స్, బీసీసీ ఇందల్వాయి, కోటగిరి, మినార్ ఎలెవన్, మాక్లూర్, హ్యాపినింగ్ ఎలెవన్, బోధన్, నరేష్ ఎలెవన్, గజానంద్ స్ట్రైకర్స్, గుండారం ఎలెవన్ జట్లు ఉన్నాయి.
ఈ జట్లకు పోటీలు ఏప్రిల్ 20 నుంచి 28 వరకు ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్లో (Women’s College Ground) నిర్వహించనున్నారు. ఈ డ్రాలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్, ఎన్ఎస్సీ ఛైర్మన్ సాయి చైతన్య, డీసీపీ బస్వారెడ్డి, జనరల్ సెక్రెటరీ కవితా రెడ్డి, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్, హితానీ, ట్రెజరర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Road Accidents Awareness | రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలి: సీపీ సాయిచైతన్య
